మన బ్రతుకిక ఇంతేనని నిరుత్సాహ పడి నీరుకారి పోరాదు.
మానవులందరికీ ఉంది ఆ మటాకు వస్తే పరమాత్మను దర్శించే అధికారం.
మమవర్త్మాను వర్తంతే మనుష్యాః అని భగవానుడే మనకు హామీ ఇచ్చాడు.
అలాంటప్పుడు బెంబేలు పడటం దేనికి మనం. మరేమి చేయాలంటారు.
యతంతో యోగినశ్చైనం. ప్రయత్నం చేస్తూపోవాలి. అంతకంతకు ప్రయత్నం
సాగిస్తూపోతే మానవుని కసాధ్యమంటూ ఏమీలేదు. మన ఏవమనుష్యాణా
మనిగదా చెప్పారు. బంధానికైనా మోక్షానికైనా మనదగ్గర ఉన్న ఏకైక
సాధనం మన మనస్సే. అది సవికల్పమైతే ప్రపంచం కనిపిస్తుంది.
నిర్వికల్పమైతే పరమాత్మే దర్శనమిస్తాడు. సంకల్పాన్ని నిర్వికల్పంగా
మార్చుకోటమే ప్రయత్నమంతా. అప్పుడు సమాహిత చిత్తుడవుతాడు
మానవుడు. అంటే ఏకాగ్రత ఏర్పడుతుంది మనస్సుకు. అదే సమాధి.
సమాధి అలవడిన వాడే యోగి. పశ్యంత్యాత్మన్యవ స్థితం. అలాటి సమాధి
శీలుడైన యోగి తప్పకుండా చూడగల డాత్మను. ఎక్కడ చూస్తాడెలా
చూస్తాడు. ఎక్కడో గాదు ఆత్మని. తనలోనే అదీ కొత్తగా ఉందని కాదు.
అవస్థితం. ఎప్పుడూ తనలో ఉన్న దానినే ఇది గదా నా స్వరూపమని
గుర్తిస్తాడు.
ఇక్కడ అత్మని తనలో అంటే తన బుద్ధిలోనని అర్థం చెబుతారు భాష్యకారులు. నిజానికి మానవుడి బుద్ధిలోనే ఉంది ఆత్మ చైతన్యం.