అయినవాడిది చర్మచక్షుస్సు కాదు. జ్ఞానమే చక్షుస్సు వాడికి. దానితో చూస్తే వాడికి సత్యమేదో దాని ఆ భాసఏదో వేరయి కనిపిస్తుంది. సత్యమంటే ఏది తన పాటికి తానున్నదో అది. దానికే వస్తువని కూడా పేరు. అది ఏదోకాదు నేననే జ్ఞానం. స్ఫురణ. నిరాకారమూ నిరంజనమూ అది. ప్రకృతి గుణాలతో సంబంధం లేదు దానికి. మీదు మిక్కిలి గుణాలన్నీ దానికి గోచరమయ్యే విషయాలు. మనస్సనండి ప్రాణమనండి -ఇంద్రియాలనండి శరీరమనండి - బాహ్యమైన విషయాలనండి - అన్నీ దానికి స్ఫురించేవే గాని స్ఫురణ కావు. దాని స్ఫురణలో ఇవన్నీ స్ఫురిస్తున్నాయి. స్ఫురించేవి స్ఫురణ ఎలా అవుతాయి. స్ఫురణ స్ఫురించే పదార్థమెలా కాగలదు. ఒక దీపం వెలుగులో పదార్థాలు కనిపిస్తున్నాయంటే పదార్థాలే వెలుగవుతాయా. వెలుగు పదార్థాలవుతుందా. ఒక దానితో ఒకటి కలిసిమెలిసి ఉన్నా తేడా చూస్తూనే ఉంటాము. అలాగే జ్ఞాన స్వరూపుడైన జీవుడీ శరీరాది సంఘాతం కాదు. ఇది వాడి జ్ఞానానికి గోచరించే సామగ్రి. ఇలా వివేచన చేసి చూస్తే మనసు దగ్గరి నుంచీ శరీరం దాకా మన స్వరూపానికి వేరయి కనిపిస్తుంది. ఇలాటి వివేక జ్ఞానమే ప్రమాణం - దానివల్ల ఏర్పడే స్వరూప జ్ఞానమే ప్రమేయం - ప్రమేయంగాని ప్రమేయం.
యతంతో యోగినశ్చైనం - పశ్యంత్యాత్మన్యవ స్థితం
యతంతో వ్యకృతాత్మానో - నైనం పశ్యంత్య చేతసః - 11
కాని నూటికి కోటికెవడో ఉంటాడట వివేక జ్ఞానమున్న మహానుభావుడు వాడుత్తమాధికారి. పోతే మధ్యమ మందాధికారు లందరూ