మళ్లీ ఒక శరీరంలో వచ్చి కూచుంటూ అందులో ఉన్నంతకాలమూ ఆయా
ఇంద్రియాల ద్వారా కష్టసుఖాలను భవిస్తున్న వాడెవడా అని పోల్చుకోలేక
పోతున్నారు లోకులు. పోల్చుకోవచ్చు. అవకాశముంది. అత్యంత దర్శన
గోచర ప్రాప్తమపి అని అంటున్నారు స్వామివారు. బాగా కనిపిస్తూనే ఉన్నదట
తేడా. ఒక వడ్రంగికీ వాడి పరికరాలకూ తేడా చూస్తున్నారు కదా. అలా
మనలోఉన్న జ్ఞానానికీ ఆ జ్ఞానమే మనస్సు పెట్టుకొని ఆలోచిస్తున్నదో
అనుభవిస్తున్నదో దానికీ భేదం తెలియటం లేదు. కొంచెం బాగా విమర్శించి
చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. చూడకపోతే అంతా అలికేసినట్టు ఏకమై
కనిపిస్తుంది. అలా ఏకంగా చూస్తున్నారు గనుకనే విమూఢా నానుపశ్యంతి.
మూఢులైన మానవులు తమ ఆత్మనీ అనాత్మ కలాపంనుంచి వేరుచేసి
చూడలేక పోతున్నారు. కారణం. దృష్టా దృష్ట విషయ భోగ బలాకృష్ణ
చేతస్తయా అని సంజాయిషీ ఇస్తున్నారు భాష్యకారులు. ఆయా శబ్ద స్పర్శాది
విషయానుభవాలు బలంగా వీడి జ్ఞానాన్ని ప్రక్కకు లాగేస్తున్నా యంటారు.
అహో కష్టం వర్తతే ఇత్యను క్రోశతి భగవాన్. అయ్యో ఎంతకష్టం వచ్చిందీ
మానవుడికని వాపోతున్నాడట ఆ భగవానుడు.
విమూఢులు చూడలేకపోతే మరి ఎవరైతే చూడగలరు. పశ్యంతి జ్ఞాన చక్షుషః అది ఎవరు చూడగలరని అడగనక్కరలేదు. అజ్ఞాని చూడలేడంటే అర్థం జ్ఞాని చూడగలడని వేరే చెప్పాలా. జ్ఞానచక్షుషః జ్ఞాని