#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

సాధనం. దాని చేతిలో ఉన్నాయి మిగతా ఇంద్రియాలు. ఇవన్నీ కరణాలేగాని కర్తకావు. కర్త జీవుడే. వాడే మనసుతో ఆలోచిస్తుంటాడు. కంటితో చూస్తుంటాడు. చెవులతో వింటుంటాడు. మరలా ఆ మనసుతోనే సుఖ దుఃఖాదులను భవిస్తుంటాడు. మనసు ద్వారా ఆలోచన - మనసు ద్వారా అనుభవం - మనసనే ద్వారం లేకపోతే ఆలోచనలే దను భవమూ లేదు. అవి రెండూ లేకుంటే జీవుడు లేడు. వాడీశ్వరుడే. ఎటువచ్చీ ఇలాటి స్వరూప జ్ఞాన ముండాలి వీడికి. అది లేనంతవరకూ అధిష్ఠాయ. ఈ ఉపాధులే తానని వాటికి తానాశ్రయమయి విషయా నుప సేవతే. ఆయాశబ్ద స్వర్శాదులైన విషయాలను వాటి ద్వారా అనుభవిస్తూనే ఉంటాడు తప్పదు.

ఉత్రామంతం స్థితం వాపి భుం జానం వా గుణాన్వితం
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః - 10

  ఇదే సంసార బంధం మానవుడికి. ప్రకృతి గుణాలైన మనః ప్రాణేంద్రియాదులతో సంబంధమే బంధం. దానితోనే ఈ దేహంలో వచ్చిపడ్డాడు. ఉతామంతం మరలా కొంతకాలానికీ దేహం ఖాళీచేసి పోతున్నాడు. స్థితం ఉన్నంతకాలం దీనిలోనే బ్రతుకుతుంటాడు. భుం జానం వా గుణాన్వితం – బ్రతికినంత కాలమూ శబ్దాదులైన విషయాల నెప్పుడూ అనుభవిస్తుంటాడు. గుణాన్వితం సుఖదుఃఖ మోహాదులైన ప్రకృతి గుణాలతో ఏకమయ్యే ఉంటాడు. అయినా చిత్రమేమంటే శరీరాన్ని వదిలేస్తూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు