#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

జీవభావం తప్పదు. జీవభావ మున్నంతవరకూ రాకపోకలూ తప్పవు. అందుకే వాయుర్గంధా నివాశయాత్. ఒక వాయు వెలాగైతే ఆయాపుష్పాల నక్కడే వదిలేసి వాటి వాసన మాత్రం తీసుకొని వెళ్లిపోతుందో అలాగే స్థూల శరీరాన్ని ఇక్కడే వదలేసి మనః ప్రాణాది సూక్ష్మ శరీర వాసనలతో వెళ్లిపోతుంటాడు మళ్లీవచ్చి ప్రవేశిస్తుంటాడు జీవుడు.

శ్రోత్రం చక్షుః స్పర్శనంచ- రసనం ఘ్రాణమేవచ
అధిష్ఠాయ మనశ్చాయం - విషయా నుప సేవతే - 9

  మనష్షష్టాణి అని ఒకమాట అన్నారేగాని ఇంతకూ ఆ ఇంద్రియాలేమిటి అవి ఎలా ఉంటాయని అడిగితే వాటిని ఫలానా అని ఇప్పుడు నిర్దేశిస్తున్నాడు గీతాచార్యుడు. శ్రోత్రం చక్షుః స్పర్శనంచ. చెవి కన్ను చర్మం రసనం ఘ్రాణమేవచ - నాలుక - ముక్కు ఇవీ ఆ అయిదు ఇంద్రియాలు. జ్ఞానేంద్రియా లంటారు వీటిని. శబ్ద స్పర్శాదుల జ్ఞానం వీటి ద్వారా అందుతున్నది కాబట్టి ఆ పేరు వచ్చింది వీటికి. పోతే మనశ్చ మనస్సొకటున్నది ఆరవది. అది అంతరింద్రియం. వీటి కధిపతి - ఇవి వ్యష్టి అయితే అది సమష్టి. శబ్దాదులైన అయిదింటి జ్ఞానమందులో స్టోరవుతుంటుంది. అది ఉత్తర్వు లిస్తేసే ఇవి పనులు చేస్తుంటాయి. తమ తమ జ్ఞానం పోగుచేసి దాని కందిస్తుంటాయి.

  అయితే అదే ఆఖరుకాదు. అది బాసయితే దానికొక బాసున్నాడు. వాడే జీవుడు. చైతన్యమే వీడి స్వరూపం. వీడికొక ఉపాధి మాత్రమే మనస్సు. వడ్రంగి చేతిలో ఒక సుత్తె బాడిస ఉన్నట్టు వీడి చేతిలో ఉంది మనసనే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు