#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

  అలాంటప్పుడు సంసార బంధమెలా ఏర్పడిందీ జీవుడికి. వీడీశ్వరుడే గదా. ఎలా రాగలిగాడీ శరీరంలోకి. మరలాదీన్ని విడిచి ఎలా పోగలుగుతున్నాడని ప్రశ్న. దానికేమిటి సమాధానమంటే చెబుతున్నాడు మహర్షి మనష్షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మనస్సుతో కలిసి ఆరింద్రియా లున్నాయి మనకు. అయిదు జ్ఞానేంద్రియాలు వాటికధిపతి మనస్సు. వెరసి ఆరింద్రియాలు. ఇవి ఆరూ వాటి వాటి స్థానాల్లో కూచుని పనిచేస్తున్నాయి. ప్రకృతిస్థాని అంటే అర్థమిది. కర్ణ శష్కుల్యాది అని అర్థం వ్రాస్తున్నారు స్వామివారు. కర్ణనేత్రాదులు. ఇంద్రియ శక్తులు, శక్తులకెప్పుడూ ఒక ఆశ్రయముండాలి. లేకుంటే అవి పనిచేయలేవు. కర్ణేంద్రియంలో శ్రవణశక్తీ, నేత్రేంద్రియంలో దర్శనశక్తీ. ఇలా ఆయాస్థానాల్లో కూచొని ఇంద్రియశక్తులు బయటికి ప్రసరిస్తుంటాయి. శబ్దాదులను గ్రహిస్తుంటాయి.

  అయితే ఇవి మనవి కావీ స్థానాలూ ఇంద్రియాలూ. ప్రకృతికి సంబంధించిన గుణాలివి. ప్రకృతికి విలక్షణుడు పురుషుడు. ప్రకృతి జడమైతే వీడు చేతనుడు. చేతనుడయి కూడా వీడచేతనమైన ప్రకృతితో చేతులు కలిపి ప్రకృతి గుణాన్నే తన స్వరూపంగా భావించాడు. భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ అని ఇంతకుముందరి అధ్యాయమే చెప్పిందీ విషయం. అంతేకాదు. కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు అని కూడా చాటింది. మనకు మంచిచెడ్డ జన్మలు వస్తున్నాయంటే దానికీ ప్రకృతి గుణాల సాంగత్యమే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు