#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

ఉండగలడు. ఇందులో అనుకోటమనే ధామం ప్రకాశమైతే అనుకొంటూ ఉండటమనే ధామం స్థానం. లేదా దాని స్థితి. ఒకటి చితి మరొకటి స్థితి. చిత్తో కటి సత్తెకటి. సూర్యచంద్ర ప్రకాశాలు సత్తే గాని చిత్తు కావు. చిత్తు కాకుంటే సత్తు కూడా కాలేవు. సచ్చిత్తులు రెండూ అవి నాభూతం గదా. అవినాభూతంగా అవి ఆత్మలో ఉంటాయే దాని అనాత్మ జగత్తులో కావు. కాబట్టి అనాత్మ భూతమైన సూర్యాది గోళాలు కూడా ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుండ వలసిందే గాని స్వతంత్రంగా లేవు.

  యద్గత్వాన నివర్తంతే - పోతే జీవన్ముక్తుడైన జ్ఞాని ఎప్పటికైనా ఆ ధామం ప్రవేశించాడంటే చాలు. మళ్లీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. వాడి ప్రయాణ మక్కడి కాఖరు. సాకాష్ఠా సా పరాగతిః అని కఠోపనిషత్తు చాటినట్టు అదే చివరి మెట్టు. అందుకే పరంధామ మంటున్నది గీత. ధామమంటే ఎక్కడికక్కడ ఒక మజిలీ అయినా కావచ్చు. పరమన్నాడు కాబట్టి ఇది మజిలీ కాదు. జీవిత గమ్యమే. గమ్యం చేరిన తరువాత ఇక ప్రయాణ మేముంది. పైగా అది అచేతనమైన గమ్యం కూడా కాదు. అఖండ చైతన్య రూపం. గమ్యమే తానయి పోయాననే జ్ఞానమెప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఇక తిరిగిరాడు. రాకపోక లజ్ఞానంలోనే గాని జ్ఞానలో ఉండటం సంభవం కాదు.

  అయితే ఒక ప్రశ్న. నను సర్వాహి గతి రా గత్యంతా. సంయోగా విప్రయోగాంతా ఇతి ప్రసిద్ధం - కధ ముచ్యతే తద్దామ గతానాం నాస్తి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు