#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

మిగతా జడ ప్రపంచాన్నంతా స్ఫురింప జేయగలదు. సూర్యచంద్రాదులు కూడా జడపదార్ధాలే కాబట్టి మనమది ఎంత ప్రకాశమని భావించినా అది కూడా జడమే. జడమైతే అవి ఎలా వెలుగుతున్నాయంటారు. తమేవ భాంత మను భాతి. ఆ ప్రకాశంలోనే ప్రకాశిస్తున్నాయవి. ఇదుగో ఈ సూర్యుడు చంద్రుడు వెలుగుతున్నారని మనం భావిస్తుంటే ఆ భావనలో స్ఫురిస్తున్నా యవి వెలుగుతున్నట్టు. అలాటి భావన మనకు కలగక పోతే తెలియదు మనకవి వెలుగుతున్నాయో లేదో. మన జ్ఞానమే దేనికైనా ప్రమాణం. ఒకటి ఉందని చెప్పినా లేదని చెప్పినా మన జ్ఞానమే చెప్పాలి. జ్ఞానం సరిహద్దులు దాటితే దాని కసలస్తిత్వమే లేదు. అస్తిత్వమే లేకుంటే ప్రకాశ మంతకన్నా లేదు. ఇప్పుడు సూర్యచంద్రాదు లనండి. వారి ప్రకాశాలనండి. అవన్నీ ప్రమాణాలు కావు. మన జ్ఞానానికి ప్రమేయాలు. కనుక స్వతః ప్రమాణం Self Evident కావవి. స్వతః ప్రమాణం కాకుంటే స్వతస్సిద్ధం Self existant కాలేవు. స్వతః ప్రకాశ Self luminous మంత కన్నా కాలేవు. అలాటి స్వతః ప్రమాణమూ స్వతస్సిద్ధమూ అయినది పరమాత్మే గనుక తద్ధామ పరమం మమ. అదే పరమమైన ధామం.

  ధామమనే మాటకు రెండర్థాలున్నాయి భాషలో. తేజస్సనీ అర్థమే. స్థానమనీ అర్థమే. రెండర్ధాలలో ప్రయోగిస్తున్నాడు మహర్షి ఈ మాటను. స్థానమంటే ఉండటం. ఎలా ఉండగలడు. తన పాటికి తాను ప్రకాశిస్తుంటే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు