#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

  ఎలాంటిదా పరమని అడిగితే వర్ణిస్తున్నాడు వినండి గీతాచార్యుడు. నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విడ్యుతో భ్రాంతి కుతోయ మగ్నిః - తమేవ భాంత మను భాతి సర్వం తస్యభాసా సర్వమిదం విభాతి అనే ఉపనిషన్మంత్రానికిది ప్రతిధ్వని. న త ద్భాసయతే సూర్యః సూర్యుడు దాన్ని వెలిగించలేడు. అలాంటి పదమది. తాను ప్రకాశిస్తూ మిగతా ప్రపంచాన్నంతటినీ ప్రకాశింప జేయవచ్చు సూర్యుడు. కాని దాన్ని ప్రకాశింప జేసే దొమ్మ లేదు సూర్యుడికి. న శశాంకః - సూర్యుడికే లేకుంటే చంద్రుడికా. చంద్రుడి కసలే లేదు. న పావకః అగ్నికా. అంతకన్నా లేదు. ప్రకాశాలనేవి ఇవి మూడే. ఈ మూడింటికీ స్వయం ప్రకాశం లేదు. అవి తామూ ప్రకాశించ లేవు. పరమాత్మ నసలే ప్రకాశింప జేయలేవు. కారణం. అది స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశమైనదే మరొక దాన్ని ప్రకాశింప జేస్తుంది. తానే స్వయంగా ప్రకాశించ లేకపోతే ఇంకొక దాన్ని ఎలా ప్రకాశింప జేయ గలదు. సూర్య చంద్రాది ప్రకాశాలన్నీ స్వయం ప్రకాశాలు కావు. కారణమేమంటే వాటికి చైతన్యం లేదు. తాము ప్రకాశిస్తున్నట్టు తమకేమాత్రమూ తెలియదు. జడపదార్థాలవి. కనుక అవి తామూ ప్రకాశించలేవు. మరొక దాన్ని అంతకన్నా ప్రకాశింప జేయలేవు.

  మరి పరమాత్మ. అది చైతన్య స్వరూపం. నేనున్నాననే భావమెప్పుడూ ఉంటుంది దానికి. కనుక అది తనకు తాను స్ఫురిస్తూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు