#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

కాబట్టి అజ్ఞానమూ అభిమానమూ రెంటినీ దూరం చేసుకోవాలి సాధకుడు. అప్పుడే జిత సంగదోషాః - దేహాదులతో గాని దానికి బాహ్యమైన చరాచర ప్రపంచంతో గాని సంగమనేది తొలగిపోయేది. అవి రెండే దీనితో మనకు లేనిపోని సాంగత్యాన్ని కల్పించాయి. శాస్త్రీయమైన భాషలో చెబితే మిధ్యాత్మ వల్లనే గౌణాత్మ ఏర్పడింది. అహం వల్లనే మమ మన మెడకు చుట్టుకొన్నది. అహం లేకపోతే మమ లేదు. దేహం మేరకే నేనున్నాననే అహం భావమే దేహానికి బాహ్యమైన కళత్ర పుత్రాదులతో గాని వస్తువాహనాలతో గాని సంబంధాన్ని మనకు తెచ్చి నెత్తిన పెట్టింది. దేహమే నేను కాదని త్రోసి పుచ్చితే అహం కాదది. ఆత్మే. ఆత్మ అయితే అది సర్వవ్యాపకం గనుక మమ కూడా ఆత్మగానే మారి కనిపిస్తుంది. దానితో మిధ్యా గౌణాత్ములు రెండూ ఆభాస అయి పోయి ముఖ్యాత్మ లేదా బ్రహ్మాత్మగా దర్శనమిస్తాయి.

  అధ్యాత్మ నిత్యాః - అయితే ఒకటి. ఆ బ్రహ్మాత్మే నా అసలైన ఆత్మ అని గుర్తించాలి సాధకుడు. గుర్తిస్తే మనమది అయిపోతామని కూడా బోల్తాపడరాదు మరలా. గుర్తించినా గుర్తించకున్నా అదే మనం. అయినా కూడా ఈ మనం కాని ఉపాధుల మూలంగా ఆ మనం గాక మన మీ మనమయి కూచున్నాము. వస్తు సిద్ధంగా అదే అయినా బుద్ధి సిద్ధంగా కాని నేరమది. అంచేత అసలైన నేను అదేనని గుర్తు చేసుకోవాలంటే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు