#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

దాన్ని పట్టుకోటానికి గాదు. దానికడ్డు పడుతున్న అనాత్మ భావాలను తొలగించు కోవటానికి. మన శరీరమూ ప్రాణమూ మనస్సూ ఇవన్నీ ఆనేననే స్ఫురణను కప్పేసి దాన్ని తమవరకే పరిమితం చేసి చూపుతున్నాయి. ఈ శరీరమే నేను ఈ ప్రాణమే నేను ఈ ఆలోచనలే నేను అని వాటి మేరకే నన్ను నేను భావించటమే నేను తగ్గిపోవటం. నిజంలో నేనీ శరీరాది సంఘాతం కాను. కారణమివి నా జ్ఞానానికి గోచరిస్తున్నాయి. నా జ్ఞానం వీటిని గోచరింప జేసుకొంటున్నది. జ్ఞానానికి స్ఫురించే ఉపాధులు జ్ఞానమెలా అవుతాయి. అయితే జ్ఞానానికెలా స్ఫురిస్తాయి. అనవసరంగా అవే నేననుకోటం నా భ్రాంతి. అంచేత అవి నేను కాదను కోవాలి మొదట. కాదనుకొంటే శరీరాదులనే అడ్డు తొలగిపోయి వ్యాపకమైన నా స్వరూపం నాకు సాక్షాత్కరిస్తుంది. అలాటి నా విశాలమైన నేను కోసమే సంకుచితమైన ఈ నేను అన్వేషణ చేయవలసి వస్తున్నది. అదే అభ్యాసం. ఎలా చేయాలీ అభ్యాసం. శరీరాదులే నేననే సంకుచిత భావం దూరం చేసుకొంటే గాని చేయలేము. ఇదుగో ఈ దూరం చేసుకొనే విధానమే వైరాగ్యం. దూరం చేసుకొన్న మరుక్షణం నా విశాలమైన స్వరూపాన్ని నేను దర్శించటమే అభ్యాసం. అప్పుడా విశాలమైన దృష్టితో చూచి నేనే గదా నాది అనే ఈ శరీరాది సంఘాత రూపంగా కనిపిస్తున్నదని దీన్ని ఆ భాసగా దర్శించటమ వలీల అవుతుంది సాధకుడికి. శరీరాదులే గాదు. దానితో పాటు మిగతా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు