మేదిగానీ. ఆ కొమ్మను పట్టుకొని గదా ఈ కొమ్మను విడిచి పెట్టవలసింది. అలా కాకుంటే అది పట్టుకోకుండానే ఇది వదిలేసి క్రిందబడి పోతాడా లేదా. అలాగే ప్రస్తుతం సంసారమనే వృక్షాన్ని అసంగమనే శస్త్రంతో కొట్టి వేయమని సలహా ఇస్తున్నది గీత మనకు. ఇది కొట్టి వేసి తతః పదం తత్పరిమార్గితవ్యం. అది పట్టుకోమంటున్నది. ఇది కొట్టివేసి అది పట్టుకొనే లోపల ఏమిటి మన గతి. త్రిశంకు స్వర్గంలాగా మధ్యలో వేళ్లాడటమే గదా. అంచేత పరమాత్మ తత్త్వమేదో మొదట అనులోమంగా పట్టుకొనే అభ్యాసం చేసి ఆ బలంతో ఈ ప్రపంచాన్ని ఆభాసగా భావించి దీనిమీద విరక్తి చెందాలని బోధించాలి మనకు. దానికి మారుగా ముందుగానే దీన్ని వదిలేయమని చెప్పటమేమిటి. ఎలా వదిలేస్తాము కాకపోయినా. ఏ బలంతో వదిలేయాలి. ఆత్మ తాలూకు బలమింకా లేదు గదా. ఆత్మ దృష్టితో చూస్తే గదా ఇది ఆభాస అయిపోయేది. లేకుంటే ఇదే వాస్తవమనే భావం మనకు వదలి పోదుగదా. అని ఆక్షేపణ.
దీనికి సమాధానముంది శాస్త్రంలో. కాని చాలా సూక్ష్మంగా గ్రహించవలసి ఉంటుంది సాధకుడు. ఆత్మను క్రొత్తగా తెలుసుకోనక్కర లేదు మనం. అది మన స్వరూపమే. ఆగంతుకం కాదది. సహజం. నేననే జ్ఞానమే ఆత్మ అంటే. అది నీకూ నాకూ ఇప్పుడుందా లేదా. ఉంది. అయితే మరి అన్వేషించటం దేనికని నీవడగవచ్చు. అన్వేషించటం