చేతులు కలిపిన నేరానికి వీడూ రంగు మార్చుకొని పుడుతున్నాడు. బ్రతుకుతున్నాడు. చివరకు చెప్పకుండా కన్ను మూస్తున్నాడు.
వస్తు జ్ఞానం లేనంతవరకూ ఆభాసే మన పాలిటికి వస్తువయి మనకు
భ్రమ కొలుపుతుంటుంది. అనేక మార్గాలలో తిప్పి మనల నలజడి పాలు
చేస్తుంది. కాబట్టి ఈ ఆభాసకు మూలమేదో ఇది దేని తాలూకు ఆభాసో
ఆ మూలభూతమైన పురుషతత్త్వాన్ని అన్వేషించి పట్టుకోవా లెప్పటికైనా.
పట్టుకొని ఆ దృష్టితో చూచిన మరుక్షణ మిక ఇది సంసారంగా కనపడదు.
ఆభాస అయి పోతుంది. అంతేకాదు. ఆభాస అయినా అది నా తాలూకు
ఆభాసే నేనే ఇలా అనేక భంగిమలలో నాకు నేనే కనిపిస్తున్నానని దీన్ని
తన విభూతిగా అర్థం చేసుకోగలడు. అప్పుడిక స్వరూపమే విభూతి విభూతే
స్వరూపం. రెండిటికీ తేడా చూడని పరిపూర్ణాద్వైతాను భవంలోనే
ఉండిపోగలం. ఇంతకన్నా ఫలమేముంది. ప్రయోజనమేముంది జీవితానికి.
మోక్షమనే మహాఫలమిది. ఇది రుచిచూస్తే మిగతావన్నీ దీనికంటే తీసికట్టే.
అయితే అంతా బాగుంది గాని ఒక పెద్ద ఆక్షేపణ వస్తున్నదిప్పుడు. దానికి సమాధానం రానంతవరకూ సాధన చేయలేడు మానవుడు. అదేమిటంటే మొదట వైరాగ్యం చెప్పి తరువాత అభ్యాసం చెబుతున్నది భగవద్గీత. వైరాగ్యం ముందా. అభ్యాసం ముందా. వైరాగ్యమనేది వదిలేయటమైతే అభ్యాసం పట్టుకోటం. పట్టుకోకుండా ఎలా వదిలేస్తా