#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

నడుస్తున్నదంటే యతః ప్రసృతా దాని నుంచే ప్రసరిస్తూ ఇలా కనిపిస్తున్నది మనకు. ఇప్పుడీ వెలుగు మన శరీరాలూ మన ఇండ్లూ వాకిండ్లూ వస్తు వాహనాలూ పట్టణమూ అంతా వ్యాపించి కనిపిస్తున్నదంటే ఇదేమిటంటారు. దాని పాటికది ఉన్నట్టుండి ఆవిర్భవించిందా. అదుగో ఆకాశంలో ఎక్కడో ఉన్న ఆ సూర్యమండలం నుంచి ఇంత దూరం భూమండలం దాకా ప్రసరిస్తూ వచ్చిందే గదా. అక్కడ మండల మిక్కడ ప్రకాశం. మండలం లేకపోతే ప్రకాశమెక్కడిది. అది మూలమిది దాని వ్యాప్తి. అది స్వరూప మిది విభూతి.

  అలాగే ఊర్ధ్వమూల మాద్యం పురుష మన్నాడంటే అదే ఈ సంసారానికంతా మూలభూతమైన తత్త్వం. అదే దీని స్వరూపం. ఇది కేవలం దాని విభూతే. వస్తువు కాదిది. వస్తువు తాలూకు ఆభాస. వస్తువొకే రూపంగా కూటస్థంగా ఉంటుంది. దాని విభూతి అలాకాక రకరకాల వేషాలు వేస్తుంటుంది. పురాణీ. పురాణమిది. పురాణి నవా పురాణీ. పాతదైనా ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శన మిస్తుంటుంది. వస్తువుగా పాతది. ఆభాసగా క్రొత్తది. ఇలా నవ నవో న్మేషంగా కనిపించే కొద్దీ ఇదే వాస్తవమని ఎప్పటికీ ఇలాగే ఉంటుందనే వ్యామోహంతో దీనితో సతమతమయి పోతున్నాడు మానవుడు. దీనిలో బందీ అయిపోయి ఇతః పరం లేకుండా బ్రతుకుతున్నాడు. రంగులు మార్చేది కాబట్టి ఇది దీనితో

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు