#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

గాని అపరోక్షం కాదు. అపరోక్ష మయితేనే అది అనుభవం. అనుభవమే అన్వేషణ కంతటికీ పర్యవసానం. అది అపరోక్షమని చెప్పాము గనుక ఆత్మ స్వరూపమే కావాలి అనాత్మ కారాదు. కనుక ఆ పురుషడేదో గాదు. సాధకుడి ఆత్మే. అందుకే ప్రపద్యతే అని ప్రధమ పురుషలో గాక ప్రపద్యే అని ఉత్తమ పురుషలో First person ప్రయోగించాడు మహర్షి. ప్రపత్తి అంటే ఇది వైష్ణవుల శరణాగతి గాదు. అద్వైతుల తాదాత్మ్యం. పరమ పురుషుణ్ణి తమకన్యంగా ఆరాధ్య దైవంగా చూస్తారు. శరణు వేడుతారు భాగవతులు. జ్ఞానులన్యంగా గాక తమ కనన్యంగా ఆత్మ స్వరూపంగా అనుభవానికి తెచ్చుకొంటారు. అదే వీరి ప్రపత్తి. జ్ఞాననవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ స్సర్వమితి అనే చోట మనమింతకు ముందే గ్రహించామీ రహస్యం. గుర్తు చేసుకొండి పాఠకులు.

  సరే. అలాటి అద్వైత శరణాగతి పొందితే కలిగే ఫలమేమి టింతకూ. ఏముంది. ఎక్కడో దూరంగా పరోక్షంగా ఉన్నట్టు భావించే ఆ భగవత్తత్త్వం సాధకుడు తన స్వరూపమేనని దానితో తదాత్మ్యం చెంది ఈ సంసార సాగరం నుంచి బయటపడటమే. అది ఎలా సంభవ మీ సంసార మప్పటికీ పూర్తిగా తొలగిపోదు గదా అంటే సమాధాన మిస్తున్నాడు మహర్షి ఏమని. యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ఇది దానికి వేరుగా ఎక్కడో లేదీ సంసారమిది ఏదోగాదు. యతః ప్రవృత్తిః ఇది ఇలా ప్రవర్తిస్తున్నదంటే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు