బోధ. ఎటు వచ్చీ అలా చూడలేక పోతున్నామిప్పుడు. చూడక దానికి విలక్షణమైన సంసారంగా చూస్తున్నాము. చూస్తే ఆ పరమాత్మే మనకిలా సంసార రూపంగా భాసిస్తున్నాడు. కాని ఎంత భాసించినా ఇది కేవల మాభాసే కాబట్టి వట్టిదే. కనిపిస్తున్నా వట్టిదే. ఆకాశంలో నలుపు కనిపించినా ఎలా అబద్ధమో అలాటి అబద్ధమే ఇది.
అబద్ధ మన్నప్పుడూ అది మనకనర్థ దాయక మన్నప్పుడూ తెలివైన వాడు చేయవలసిన పనేమిటి. అలాగే దీన్ని దగ్గర పెట్టుకొని దీన్ని పోషిస్తూ దీనివల్ల కలిగే ఉపద్రవాలన్నీ అనుభవిస్తూ అదే బ్రహ్మానందం భజగోవిందమని మురిసిపోవటమా. కాదు. ఇది ఎంత అశ్వత్థమైనా ఎంత అశ్వత్థ నారాయణ అని దేవతా మూర్తిగా దీన్ని ఆరాధించినా అది తెలివి తక్కువే. మరేమిటంటారు. కూకటి వేళ్లతో పెరికి పారేయాలీ వృక్షాన్ని. సువిరూఢ మూలం. బాగా వేళ్లు పాతుకొని ఉన్నదది. ఊడలు గాఢంగా దిగి నేలలో గూఢంగా దాగి ఉన్నాయి. అయినా నరికి పారేయక తప్పదు. కనపడదన్నారు గదా. ఈ వృక్ష మబద్దమని కూడా అన్నారు గదా. అబద్ధమైనా కనపడుతున్నదొక స్వప్నంలాగా అని కూడా చెప్పాము గదా. కనపడని వృక్షాన్ని కనపడని ఖడ్గమే చేతికి తీసుకొని నరికేయండి. అసంగ శస్త్రేణ దృఢన ఛిత్వా, వృక్షమెలా అనిర్వచనీయమో అలాగే దాన్ని ఖండించే గొడ్డలి కూడా గొడ్డలి కాని గొడ్డలే. అదే అసంగ శస్త్రం. అసంగమంటే
Page 216