#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

స్వప్నానికి జాగ్రత్తూ - మృగ తృష్టికకు సూర్యరశ్మీ గంధర్వ నగరాని కాకాశమూ ఆధారాలనుకో. ఆ ఆధిష్ఠానాన్ని గుర్తించకనే అదే ఈ ఈ రూపాలలో మనకు దర్శనమిచ్చినా ఈ రూపాలు వాటి పాటికవి లేవు. అభావమే. కేవలం వాటి అధిష్ఠానంగానే అవి వాస్తవం. అయినా కనపడుతున్నాయంటే ఆ కనపడేది అవి కాదు. వాటి అధిష్ఠానమే తద్రూపంగా భాసిస్తున్నదని జవాబు.

  అలాగే ప్రస్తుతమీ సంసారం కూడా ఉందంటే ఉంది. లేదంటే లేదు. దృష్ట నష్ట స్వరూపమిది. ఏదో ఉన్నట్టు కనిపిస్తుంటుంది. దగ్గరకు పోయి చూస్తే కనపడదు. మాయ మయి పోతుంది. అయినా పోవటం లేదు గదా అంటావు. పోకున్నా వస్తువు కాదది ఆభాస. వస్తువు దాని కధిష్ఠానమైన ఆత్మ చైతన్యం. అదే మన అజ్ఞానవశాత్తూ దాన్ని గుర్తించక మరుగుపడిపోయి మరలా సంసారమనే ఈ రూపంలో మనకు దర్శనమిస్తున్నది. పరమాత్మ గానే ఇది సత్యం. ప్రపంచంగా కాదు. ఇంకా ఒక రహస్యమేమంటే అసలిది వాస్తవంలో పరమాత్మే కాబట్టి దీనికి రూపం కనపడటం లేదని చెప్పినా చెప్పవచ్చు. పరమాత్మకు నామరూపాలు లేవు గదా. అలాగే ఆదిమధ్యాంతాలు లేవని చెప్పినా చెప్పవచ్చు. పరమాత్మ అనాది మధ్యలయుడు గదా. పరమాత్మ అనే భావనతో చూస్తే ఇది పరమాత్మే. ఆయనకు సలక్షణమే సందేహం లేదు. అలా చూడమనే పెద్దల

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు