#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

  అయితే ఒక ఆశంక. ఆది మధ్యాంతాలు మూడూ లేవంటే ఇక ఆ పదార్ధమస ల భావ Absence మనే గదా అర్థం. అత్యంతా భావమైన ఈ సంసారం మనకిప్పుడు కనపడుతున్నది గదా. దీనివల్ల కష్టసుఖాలు కూడా కలుగుతున్నాయి గదా. మరి ఇంత ప్రత్యక్షంగా చూస్తూ చేస్తున్నప్పుడిది లేకుండా ఎలా పోయింది. అది మీరు వాచా అంటే అనవచ్చు గాని ప్రత్యక్షంగా మాకూ మీకూ కలిగే అనుభవాన్ని ఎలా కాదనగలరని ప్రశ్న. దీనికి సమాధాన మేమిస్తున్నారో చూడండి భగవత్పాదులు. స్వప్న మరీచ్యుదక మాయా గంధర్వ సగర సమత్వాత్ - దృష్ట నష్ట స్వరూపోహి సః - ఇదీ ఆయన సమాధానం. మనం రాత్రి కాలంలో ఒక స్వప్నం ప్రత్యక్షంగానే చూస్తుంటాము. ఒక ఎండమావులు దూరంగా కనిపిస్తుంటే చూస్తాము. ఐంద్రజాలికుడొకడు తన గారడీ విద్యతో ఒక గంధర్వ నగరాన్ని సృష్టించి చూపితే గుడ్లప్పగించి చూస్తుంటాము. అలాగే చూస్తున్నామీ ప్రపంచాన్ని మనం చూస్తుంటే కనిపిస్తున్నది. చూస్తే కనిపిస్తున్నదా. కనిపిస్తే చూస్తున్నామా అని అడుగు. రెండూ అబద్ధమే. ఎందుకంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు పరస్పర సాపేక్ష భావాలివి Inter related. ఇదుంటే గాని అది లేదు. అదుంటే గాని ఇది లేదన్నప్పుడు రెండూ అసత్యమేనని అద్వైతుల తీర్మానం. అయితే మరేది సత్యం. సత్యమనే ఆధారం లేకుండా అసత్యం కనిపించదు గదా అని అడిగితే బీజ వృక్షాలకు నేల ఆధారమయినట్టే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు