ఆకర్షకంగా కనిపించినా పేలవమని పిస్తుంది. ఇదే వైరాగ్యం. వైరాగ్యమెంత ముదురు పాకానబడితే అంత దాన్ని అందుకొనే అభ్యాసం పెరిగిపోతుంటుంది. అది బాగా బలం పుంజుకొంటే చివరికీ సంసార బంధం నుంచి పూర్తిగా విముక్తి పొందగలడు మానవుడు. ఇప్పుడీ వైరాగ్యమేమిటో అభ్యాసమేమిటో రెండింటినీ బ్రహ్మాండంగా మనకు బయట పెడుతున్నాడు మహర్షి
నరూప మస్యేహ తథోపలభ్యతే. నాంతో నచా దిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమంటే ఏమనుకొంటున్నారో. అది లోకంలో వృక్షంలాంటి దనుకొంటున్నారా. దానికన్నా విలక్షణమైన వృక్షమిది. అందుకే దానికున్న లక్షణాలేవీ లేవు దీనికి. లోకంలో దానికైతే ఒక రూపమనేది ఉంటుంది. అదుగో వేరు ఇదిగో బోద - ఇవిగో కొమ్మలు - అవిగో రెమ్మలని వేలు పెట్ట చూపవచ్చు. కండ్లు పెట్టి చూడవచ్చు. పంచేంద్రియాలకూ గోచరిస్తూనే ఉంటుందేదో ఒక రూపంలో. ఇది అలాంటిది గాదీ వృక్షం. ఏ ఇంద్రియానికీ గోచరం కాదు. రూపమే లేదు దీనికి. నోపలభ్యతే. అందుకే కంటికి కనపడదు.
అదేమిటి. ఎందుకు కనపడదు. వృక్షమనే అంటున్నారు గదా. వృక్షమన్నప్పుడు కనపడాలి గదా- నిజమే. కాని దీనికాది లేదు. అంటే ఇత ఆరభ్య అయం ప్రవృత్తః ఇతిన కేనచి ద్గమ్యతే. ఇక్కడి నుంచి
Page 212