#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

న రూప మస్యేహ తథోప లభ్యతే
నాంతో నచాది ర్నచ సంప్రతిష్ఠా
అశ్వత్థ మేనం సువిరూఢ మూల
మసంగ శస్త్రేణ దృథేన ఛిత్వా - 3

తతః పదంత త్పరి మార్గి తవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః -
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ - 4

  మంచిదే. కాని ఆ వైరాగ్యమెలా కలుగుతుంది. ఆ జ్ఞానమెలా ఉదయిస్తుందీ మానవుడికి. మానవుడే గదా కర్మకు గాని జ్ఞానానికి గాని అధికారి అని పేర్కొన్నారు. మరి అధికారమంటే అందులో రెండున్నా యంశాలు. సామర్థ్యమొకటి Equipment అర్థిత్వ Aspiration మొకటి. విశిష్టమైన ఈ శరీర నిర్మాణమే సామర్థ్యం. ఈ మానవ శరీరం మానవ మాత్రులందరికీ ఉంది. సర్వసాధారణమది. కాని ఇది ఒక్కటే ఉంటే సరిపోదు. ఫలానుభవానికే గాని ప్రయత్నానికి పనికి రాదు. దీనినే శాస్త్రం బోధించే సరియైన మార్గంలో వాడుకొంటే అది ప్రయత్నం. దానికే అర్థిత్వమని పేరు Aspiration. దీనికంతటికీ మూలభూతమైన సత్యమేదో దాని నన్వేషించి పట్టుకోవాలనే ఆకాంక్షే అర్థిత్వం. అప్పుడే ఇది పైకి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు