#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

లోకులూ శాస్త్రజ్ఞులూ అందరూ. దీన్ని దాటిపోయి మూలాన్ని ఎప్పుడు చూడాలి వీరు. అలా చూడకపోతే సమగ్రమైన జ్ఞానమెలా అవుతుంది. అందుకే గురువుగారు మనలనింతగా మందలించటం. వేదవేదాంగాలెంత అభ్యసించినా ప్రపంచాన్ని నీవెంత గాలించినా సమూలంగా దీన్ని పట్టుకోనంత వరకూ అది వ్యర్థ ప్రయాసేనని.

అధశ్చోర్థ్వం ప్రసృతా స్తస్య శాఖాః
గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః
అధశ్చ మూలా న్యను సంతతాని
కర్మాను బంధీని మనుష్యలోకే - 2

  ఇక్కడ మూలం మాయా శక్తి యుక్తమైన పరమాత్మే గనుక అదే దీని స్వరూపమీ సంసారానికి. మరి ఈ సంసారమో. సువర్ణాని కాభరణాలలాగా దాని విభూతే ఇది. స్వరూపం కంటే విభూతి విలక్షణంగా ఎక్కడా లేదు. ఉన్నట్టు కేవల మాభాసే. వాస్తవం కాదు. అయినా దీనితో వ్యవహరిస్తున్నంత వరకూ వాస్తవ మనుకొనే వ్యవహరిస్తుంటాము. ఇదుగో మన ఈ వ్యవహారాన్ని బట్టే దీన్ని చిలువలు పలువలు పెట్టి ఇంకా వర్ణిస్తున్నాడీ సంసార వృక్షాన్ని మహర్షి

  అధ శ్చోర్ధ్వం ప్రసృతా స్తస్యశాఖాః - క్రిందికీ పైకీ కూడా ప్రసరిస్తున్నాయి దాని కొమ్మలు. పైకి ప్రసరించేదేమిటి కొమ్మలెప్పుడూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు