#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

సంసార వృక్షం వాడిపోకుండా నిత్యమూ నీరు పోసి పెంచుతున్నదీ దాన్ని కాపాడుతున్నదీ వేద వాఙ్మయమే. కాబట్టి ఇవే పర్ణాలీ వృక్షానికి.

  యస్తం వేద సవేదవిత్ ఎవడు దీన్ని బాగా గుర్తిస్తాడో వాడికే వేదార్ధం చక్కగా బోధ పడ్డదని మేము భావిస్తాము. అంతేగాని నాలుగు వేదాలూ ఊరక యాంత్రికంగా వర్ణించే ఘనాపాఠీలకు గాదు. వేదం వల్లె వేయటం కాదు. వేదార్ధం తెలుసుకోమంటారు భగవత్పాదులు. వేదవిత్తంటే వేదార్ధ విత్తని వ్రాశారాయన. అది ఉపనిషత్తు. వేదార్ధమదే. అలాకాక కర్మోపాసనలే వేదార్ధ మనుకొంటే దెబ్బ తింటావు. అది సంసార మనే సమస్యనింకా పెద్దది చేస్తుంది. ఇహంకాక పరమొక టుందని చూపుతుంటుంది. ఈ జన్మ కాక ఉత్తర జన్మలు జ్ఞాపకం చేస్తుంది. ఒక అబద్ధానికి మరొక అబద్ధం తోడయి నిజం మరుగున పడుతుంది. నిజమేదో అది తెలుసుకో. అప్పుడిదంతా అబద్దమయి పోతుంది. ఎలా తెలుసు కోమంటారా నిజాన్ని. యధా వ్యాఖ్యాతం సంసార వృక్షం సమూలం యోవేద. నహి సమూలాత్ సంసార వృక్షా దస్మాత్ జ్ఞేయః అన్యః అణుమాత్రోపి అవశిష్టః అస్తి. మేమిప్పుడు వర్ణించిన సంసార మనే వృక్షాన్ని మూలంతో సహా తెలుసుకొంటే చాలు. ఇక నీవు తెలుసుకో వలసిందేదీ మిగలదు. అంతా నీకు తెలిసిపోయినట్టే నంటారు.

  మూలమేమని చెప్పాడీ సంసారానికి. పరమాత్మ అని గదా. ఆయన కింకా ఏముందన్నాడు. మాయాశక్తి ఒకటుందని చెప్పాడు. ఇప్పుడా శక్తితో సహా పరమాత్మను పట్టుకోవాలి మనం. అంటే పరమాత్మ ఏమిటో

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు