దీని కతీతంగానే ఉంటుంది సహజంగా. ఆద్యంతాలు నిర్వచించట మసాధ్యం గనుక అవ్యయమైనదీ వృక్షం.
మరి అధ్యశ్శాఖమెలా అయిందిది. వృక్షాని కెక్కడైనా వేరు క్రిందా కొమ్మలు పైనా ఉండటం స్వాభావికం. దీని కలాగాక వేరుపైనా కొమ్మలు క్రిందా ఉన్నట్టు వర్ణిస్తారేమిటి. దీన్నిబట్టే తెలుసుకోండి మీరిది మాయా మయమైన వృక్షమంటారు భాష్యకారులు. వాస్తవం కాదిది. ఆభాసరూప మైనది. కాల్పనికమైన వృక్షం. కల్పన అన్నప్పుడది ఎలాగైనా ఉండవచ్చు అభ్యంతర మేముంది. అయితే ఆశాఖలేమి టింతకూ. మహదహం కార తన్మాత్రాదయ శ్శాఖాః అంటారు. అవి పారమేశ్వరమైన శక్తి వల్ల ఏర్పడ్డవే కాబట్టి దానికి క్రింద ఉండవలసిందే. మూలమయింది. శాఖలయినాయి. మరి ఆకులో. ఛందాంసి యస్య పర్ణాని. ఆకులేవో గావు. వేదాలే. ఛాదనాత్ ఛందః - కప్పి ఉంచేదేదో అది ఛందస్సు. వృక్షాన్ని కప్పి ఉంటాయాకులు. అలాగే వేదాలు కూడా ఈ సంసార వృక్షాన్ని నిత్యమూ కప్పి ఉంచి దీన్ని కాపాడుతున్నాయట. ఋగాది వేద వాఙ్మయమే గదా శాస్త్రం. శాస్త్రం విధించిన కర్మలూ ఉపాసనలూ ఆచరిస్తూ వాటి ఫలానుభవం కోసం లోకాంతర జన్మాంతరాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు జీవులు. ధర్మా ధర్మ తద్ధేతు ఫల ప్రదర్శనార్థత్వా తంటారు భాష్యకారులు. ధర్మా ధర్మాలనే హేతువులనూ - వాటివల్ల కలిగే సుఖ దుఃఖ ఫలాలనూ బోధిస్తూ మనకీ