భాగవతంలో గజేంద్రుడి వృత్తాంత మిదే సత్యాన్ని చాటుతుంది మనకు. ఇంద్రద్యుమ్నుడి జన్మలో మహాభక్తుడే అతడు. కాని అదే మోక్షమివ్వ లేదతనికి. గజేంద్రుడుగా జన్మించి జ్ఞాని అయిన తరువాతనే లభించిందది.
ఈ విధంగా సగుణ భక్తుడే క్రమంగా ముక్తి పొందుతాడని చెప్పినప్పుడిక కిము వక్తవ్యం ఆత్మన స్తత్త్వమేవ సమ్యగ్ విజానంతః ఇతి - కేవలం నిర్గుణ తత్త్వాన్నే భజించే అనన్య భక్తుడైన జ్ఞాని పొందటంలో ఆశ్చర్యమేముంది. అన్యంగా గాక ఆత్మ స్వరూపంగానే చూస్తున్నాడు గదా వాడు. ఇక చెప్పేదేముంది. అతః అంచేత ఇలాటి సూక్ష్మమిందులో దాగి ఉందని అర్జునుడి కంతగా తెలియదని భగవానర్జునేన అపృష్టోపి. కృష్ణ భగవాను డర్జునుడు తన్నడగక పోయినా ఆత్మన స్తత్త్వం వివక్షుః ఉవాచ ఊర్ధ్వమూల మిత్యాదినా. ఆత్మ తత్త్వజ్ఞానమే సాక్షాత్తుగా మోక్షాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే న్యాయాన్ని అనుసరించి అలాటి నిర్గుణరూపమైన జ్ఞానాన్నే బోధిస్తు న్నాడర్జునుడికి.
అది కూడా ఒక వృక్షరూప కల్పనతో చేస్తున్నాడా బోధ. ఎందుకీ కల్పన సూటిగా చెప్పవచ్చు గదా. తత్ర తావత్ వృక్ష రూపక కల్పనయా వైరాగ్యహేతోః సంసార స్వరూపం వర్ణ యతి. వృక్ష రూపకమంటే సంసారాన్ని ఒక వృక్షంతో పోల్చి చెప్పటం అది ఎందుకంటే వైరాగ్యహేతోః అని బయటపెడుతున్నారు భాష్యకారులు. వైరాగ్యం కోసమట. ఒకటి చీ అని దానిమీద విరక్తి చెందితేగాని మరొకటి పట్టుకోవాలని దానిమీద కృషి చేయము. మనమిప్పుడీ సంసారమనేది మిధ్యాభూతమని