#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

ఆ ఇద్దరి కన్నా శ్రేష్ఠమైన తత్త్వం కాబట్టి ఇది పురుషోత్తము డయింది. మాం. నేనన్నా పురుషోత్తముడన్నా అప్పటికొకరే. గుణాతీతమైన పరమాత్మ స్వరూపం.

  పోతే పట్టుకొనే మార్గ మవ్యభిచారి అయిన భక్తి యోగమన్నారే అదే పురుషోత్తమ ప్రాప్తి యోగం. ప్రాప్తి అంటే పొందటమని అర్థం. దేన్ని పొందాలి. ఎవడు పొందాలి. పురుషుడు పురుషోత్తమత్వాన్ని పొందాలెప్పటికైనా. పురుషుడంటే అర్జునుడిలాంటి నరుడు. గుణాధీనుడయి బ్రతుకుతున్న జీవుడు. వీడు క్రమంగా ఈ ప్రకృతి గుణాలను ఛేదించుకొని బయట పడి ఈశ్వర భావాన్ని అందుకోవాలి. అదే ప్రాప్తి. ఎలా అందుకోవాలంటే చెబుతున్నా రామార్గ మవ్యభిచారి అయిన భక్తి లేదా ఆత్మజ్ఞానమే నని. ఇదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు భగవత్పాదుల వతారిక వ్రాస్తున్నారు. విందామేమి సెలవిస్తారో.

  యస్మా న్మదధీనం కర్మిణాం కర్మఫలం జ్ఞానినాంచ జ్ఞానఫలం. కర్మిష్ఠులకు కర్మఫలం జ్ఞానులకు జ్ఞానఫలం ప్రాప్తించాలంటే వారి అకౌంటంతా నాదగ్గర ఉంది సుమా. ఎవరికెంత జీతమివ్వాలో తేల్చి చెబుతా. నీవు కర్మిష్ఠుడవా. అయితే నీకు పితృలోకమో దేవలోకమో ప్రాప్తి. మరి నీవు జ్ఞానివా. అయితే నీకు పురుషోత్తమ ప్రాప్తినే ప్రసాదిస్తా నంటాడు పరమాత్మ. కారణమేమంటే పరమాత్మ అంటే సర్వజ్ఞుడు. ఎవడి కెలాటి యోగ్యత ఉందో ఆ యోగ్యతకు తగిన ఫలమేమిటో అది వారి కెలా ఇవ్వాలో ఆయనకే తెలుసు. పుష్కలంగా ధనమున్న వాడే కష్ట జీవులకే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు