#


Index

గుణత్రయ విభాగ యోగము

రెండూ ఒకటే. అంతేకాదు. సవికల్ప నిర్వికల్ప రూపంగా కనపడే బ్రహ్మతత్త్వానికి కూడా నేను ఆశ్రయం. బ్రహ్మమను - ఈశ్వరుడను. ఆయన శక్తి అను. అన్నీ కలిసి ఒక రూపమైతే ఆ ఏకైకమైన తత్త్వాన్ని భావించే నా అఖండ భావనా రూపమైన ప్రత్యగాత్మే అంతటికీ ఆధారమవుతున్నది. జ్ఞాన గమ్యమైనది పరమాత్మ అయితే జ్ఞానం ప్రత్యగాత్మే. నేనే గమ్యం నేనే గమకమని భావిస్తే ప్రత్యగాత్మ పరమాత్మే - పరమాత్మ ప్రత్యగాత్మే. ఘటాకాశమే మహాకాశం. మహాకాశమే ఘటాకాశం. పరోక్షమైన ప్రత్యగాత్మే పరమాత్మ. అపరోక్షమైన పరమాత్మే ప్రత్యగాత్మ. ఈ విధంగా అఖండమైన అద్వైత భావాన్ని అద్భుతంగా చాటి చెబుతున్నాడు వ్యాసభగవానుడు మనకీ అధ్యాయాంతంలో.

ఇతి
గుణత్రయాధ్యాయః సమాప్తః







బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు