ఇంతకూ సారాంశమేమంటే వ్రాస్తున్నారు భాష్యకారులు. ఉదాసీన వత్తనే శ్లోకం మొదలుకొని గుణాతీతస్స ఉచ్యతే అనే శ్లోకం వరకూ చెప్పిన లక్షణాలన్నీ గుణాతీత స్థితి నందుకోవలసిన సాధకుడికి ప్రయత్నించి అలవరుచుకో వలసినవి. స్థిరీభూతం తు స్వసం వేద్యం సత్ గుణాతీతస్య యతే ర్లక్షణం. అదే బాగా స్థిరపడి తనకే స్వానుభవానికి వస్తే అప్పుడవి గుణాతీతుడైన సిద్ధుడికి కేవలం లక్షణాలుగా మారుతాయి. పోతే ప్రస్తుతం గుణాలనెలా దాటిపోగలడు మానవుడు. దానికేమిటి సాధన మార్గమని ప్రశ్న వచ్చిందే. దానికి ప్రతివచన మిస్తున్నది గీత.
మాంచ యోº వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే
సగుణా సతీ త్యైతాన్ - బ్రహ్మభూయాయ కల్పతే - 26
మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన. భక్తి యోగమే ఉపాయం దానికి. భజించటమే భక్తి. భజించటమంటే పట్టుకోటం. దేన్ని. బ్రహ్మ స్వరూపాన్ని. ఎక్కడ ఉందది. సర్వభూతాశ్రయమని వ్రాస్తున్నారు స్వామివారు. ఈశ్వర స్సర్వ భూతానా మన్నట్టు చరాచర పదార్థాలన్నీ వ్యాపించి ఉందది. అలాటి దాన్ని పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి. అవ్యభిచారేణ. వ్యభిచారమనేది ఏమాత్రమూ ఉండకూడదు. అంటే ఇటూ అటూ చెదరి పోకూడదు సాధకుడి మనస్సు. మరేదో ఉందనే చాపల్యమే చెదిరిపోవటం. ఉన్నదంతా పరమాత్మ తత్త్వమే దానికన్యంగా