#


Index

గుణత్రయ విభాగ యోగము

వాణ్ణి స్వరూపావస్థలో నుంచి తప్పించలేవు. కదిలించలేవు. ఇవి ప్రకృతి గుణాలు. వస్తూ పోతూ ఉంటాయి. వీటితో నాకెలాటి సంబంధమూ లేదు. కేవలం వీటి రాకపోకలను సాక్షిగా గమనిస్తున్న కూటస్థుణ్ణి నేనని ఎప్పుడూ తన స్వరూపాన్ని తాను గుర్తు చేసుకొంటూ ఏమరుపాటు చెందడు.

  అంతేకాదు. గుణాలంటే అవి కార్యకరణ విషయాలనే మూడు రూపాలను ధరించి కనిపిస్తుంటాయి. అందులో ఏ పని జరిగినా కరణ రూపంగా ఉన్న గుణాలే విషయరూపంగా మారిన గుణాలతో సంబంధం పెట్టుకొని ప్రవర్తిస్తున్నాయి. గుణా గుణేషు వర్తంతే అని గదా ఇంతకు పూర్వం పేర్కొన్నారు. అదే ఇప్పుడూ చెబుతున్నారు. ఏది జరిగినా గుణాలే తమలో తాము జరుపుకొంటున్నాయి గాని గుణాలకు సాక్షిగా ఉన్న చైతన్యానికి వాటి స్పర్శ ఏమాత్రమూ లేదు. అది ఎప్పుడూ ఉదాసీనమే అనే దృష్టి సడలకుండా ఉంటాడు గుణాతీతుడైన వాడు. గుణావర్తంత ఇత్యేవ యోవ తిష్ఠతి అంటే ఇదీ అర్థం. అవతిష్ఠతి అంటే అలాగే ఉండిపోతాడు. నేంగతే. అంతేగాని ఏది జరిగితే అది తానే జరుపుతున్నానని దానితోపాటు తానూ కదిలిపోడు.

సమదుఃఖ సుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః
తుల్య ప్రియా ప్రియోధీర - స్తుల్య నిందా త్మ సంస్తుతిః - 24

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు