#


Index

గుణత్రయ విభాగ యోగము

కాగా ఇదే రెండవ దానికి కూడా జవాబు. అదేమిటా ప్రశ్న గుణాతీతత్వాన్ని అందుకొనే మార్గమేమిటని గదా అడిగాడు. దానికీ ఇదే సమాధానమెలా అయింది. గుణాతీతుడి లక్షణం వర్ణించాడంటే అదే మనం కూడా అలవరుచుకొని ఆ స్థాయినందు కోవాలని గదా తాత్పర్యం. వాడెలా వాటిని దాటిపోయి ఉదాసీనంగా బ్రతుకుతున్నాడో మనమూ అలాగే బ్రతుకు సాగించాలనే గదా. ఇంతకు పూర్వమొక మాట చెప్పాము సాంఖ్యయోగంలో. గుర్తున్నదా. స్థిత ప్రజ్ఞుడికేది లక్షణమో సాధకుడి కది ప్రయత్నమని - సాధకుడి కేది ప్రయత్న సాధ్యమో అది జ్ఞానికి లక్షణమని గదా భాష్యకారులక్కడ పేర్కొన్నారు. అదే ఇక్కడ మన మనుసంధానం చేసుకోవలసి ఉంది. అంచేత ఇంతకూ చెప్ప వచ్చిందేమంటే అర్జునుడు వేసిన రెండు ప్రశ్నలకూ కలిసి వచ్చిందిక్కడ సమాధానం.

ఉదాసీన వ దాసీనో - గుణై ర్యోన విచాల్యతే
గుణా వర్తంత ఇత్యేవ - యో వతిష్ఠతి నేంగతే - 23

  పోతే ఇప్పుడు గుణాతీతుడి ఆచార వ్యవహారా లెలా ఉంటాయని అడిగాడే మరొక ప్రశ్న. దానికిస్తున్నాడు జవాబు. ఉదాసీనంగా ఉంటాడు గుణాతీతుడు. నకస్యచి త్పక్షం భజతే. ఎటువైపూ మొగ్గు చూపడు. త్రాసులాగా ఉంటుంది వాడి ప్రవర్తన. అలాటి సామ్యస్థితిలోనే కూచొని ఉంటాడు. గుణైర్యోన విచాల్యతే - అంచేతనే త్రిగుణాలలో ఏ ఒక్క గుణమూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు