#


Index

గుణత్రయ విభాగ యోగము

న నివృత్తాని కాంక్షతి మరలా కలిగితే ఎంతో బాగుండునని వాటి కోసం ప్రాకులాడడు. అవి తనకు కలిగినట్టే కలిగి తొలగిపోతుంటే

  అయితే ఇలా రాగద్వేషాలు పెట్టుకోకుండా ఉంటాడనేది న పరప్రత్యక్షం లింగం. ఇతరులకే మాత్రమూ అంతుపట్టేది కాదు. కింతర్హి. అయితే మరేమంటారు. స్వాత్మ ప్రత్యక్షత్వాత్ ఆత్మార్థ మేవ ఏతల్లక్షణం. తనకు తనకే తెలిసిపోతుంటుంది కాబట్టి తనకు మాత్రమే సంబంధించినదీ లక్షణం. నహి స్వాత్మ విషయం ద్వేష మాకాంక్షాంవా పరః పశ్యతి ఎందుకంటే స్వాత్మ విషయమైన ద్వేషం కాని ఆకాంక్ష గాని మరి ఇతరు లెవ్వరూ చూడలేరు గదా. కారణం. వీరు గుణాధీనులైతే వాడొక్కడూ గుణాతీతుడు. గుణాతీతుడి దృష్టి చేష్టా గుణాధీనుడి కెలా అర్థమవుతుందని ప్రశ్నిస్తారు భాష్యకారులు.

  పోతే ఇప్పుడీ శ్లోకం ముందు మనం వేసిన రెండు ప్రశ్నలకూ జవాబెలా చెప్పిందని అడగవచ్చు మీరు. ఏమిటా రెండు ప్రశ్నలూ. గుణాతీతుడయి నందు కేమిటి నిదర్శనమని గదా మొదటి ప్రశ్న. రాగద్వేషాలు లేకుండా మనసు నిర్మలంగా నిర్లిప్తంగా పెట్టుకొని గుణాలనూ వాటి కార్యాలనూ ఎప్పటికప్పు డుదాసీనంగా దర్శిస్తూ ఉండటమనేదే మనకు నిదర్శనం. అదే గుణాతీతుడి లక్షణం. అలా ఉదాసీనంగా లేకుంటే వాడి ప్రవర్తనలో రాగద్వేషాలనే ద్వంద్వాలు బయటపడేవి. ఇది మొదటి ప్రశ్నకు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు