#


Index

గుణత్రయ విభాగ యోగము

అప్పటికి ఒకటి గాదు. రెండు ప్రశ్నలివి. గుణాతీతుడి లక్షణమూ అడుగుతున్నాడు. గుణాతీతు డయ్యే ఉపాయమూ అడుగుతున్నా డర్జునుడు. రెండు ప్రశ్నలకూ జవాబు చెప్పాలిప్పుడు భగవానుడు. చెబుతున్నాడు. అది కూడా అస్మిన్ శ్లోకే ప్రశ్నద్వయార్ధం ప్రతి వచనం భగవానువాచ అంటారు భగవత్పాదులు. రెండు ప్రశ్నలకూ కలిపి ఇప్పుడు రాబోయే ఒకే శ్లోకంలో సమాధాన మిస్తున్నాడట.

ప్రకాశంచ ప్రవృత్తించ- మోహ మేవచ పాండవ
సద్వేష్టి సంప్రవృత్తాని న ని వృత్తాని కాంక్షతి - 22

  అది ఎలాగో వర్ణిస్తున్నాడు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ. ప్రకాశమనేది సత్త్వగుణ కార్యం. అది నాకు వివేక జ్ఞానమిచ్చినా సుఖానుభవంలో పడేసి నన్ను బంధిస్తుంది. ప్రవృత్తి అంటే అది రజోగుణ కార్యం. అలాగే మోహమనేది తమః కార్యం. సంప్రవృత్తాని అవి నాకు విషయంగా బయటపడి కనిపిస్తుంటాయి. అప్పుడు నాకీ తామసమైన భావమేర్పడింది. దానివల్ల నేను మూఢుడనయి పోయాను. ఇదుగో నాకీ రాజసమైన భావమేర్పడి నన్ను నా స్వరూప స్థితి నుంచి ప్రక్కకు లాగుతున్నది. దానితో నా మనసు కెంతో ఆందోళనగా ఉన్నదని ఇలాటి సాత్త్విక రాజస తామస భావాలు కలుగుతున్నప్పుడు వాటిని గుణాతీతుడైన వాడు న ద్వేష్టి. తన కన్యంగా చూచి ద్వేషించడు. అలాగే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు