#


Index

గుణత్రయ విభాగ యోగము

అదీ ఏదో క్రొత్తగా పట్టుకొంటున్నామని అపోహ పెట్టుకోరాదు మరలా పట్టుకొన్న దాన్నే మధ్యలో మరచిపోయి మరలా గుర్తు చేసుకొంటున్నా మనే భావించాలి. దీనికే ప్రత్యభిజ్ఞ అని పేరు శాస్త్రంలో. ఇది ఒక్కటే సాధన మరేదీ గాదు.

కైర్లింగై స్త్రీన్ గుణానేతా - నతీతో భవతి ప్రభో
కిమాచారః కధం చైతాం - స్త్రీ న్గుణా నతివర్తతే - 21

  అయితే మరి జీవించి ఉండగానే అమృతుడయి పోతాడీ మానవుడని ఆశీర్వదించారే దానికేమిటి నిదర్శనం. వాడు నిజంగా ముక్తుడయ్యాడో లేదో తెలుసుకోట మెలాగ. మనలాగే బ్రతుకుతుంటాడు. మనమధ్యనే తిరుగుతుంటాడు గదా. మనకన్నా ఏ విశేషముంది వాడిలో. అది ఎలా బయటపడుతుందని ఇప్పుడొక ఆశంక. అదే ఆవిష్కరిస్తున్నాడు వ్యాసభగవానుడు. కైర్లింగైః అని. గుణాలను దాటిపోతాడన్నారు గదా. గుణాతీతుడయి పోయాడని ఏ ఏ లింగాలను బట్టి మనం గ్రహించాలి. లింగమంటే బయటపడి కనిపించే చిహ్నం. గుర్తు. లక్షణం. ఏమిటా లక్షణాలు. కిమాచారః - అలాటి వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది. అంతే కాదు. కథం చైతాన్ త్రీస్ గుణా నతి వర్తతే. వాడొకడే కాదు గదా హక్కుదారు. అందరికీ ఉంది గదా అలా దాటిపోయే అధికారం. అవకాశం. మరి ఆ మార్గమేదో చెప్పండి. మేమూ ప్రయత్నిస్తామని ప్రశ్న వచ్చింది.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు