#


Index

గుణత్రయ విభాగ యోగము

భాష్యకారులు. గుణాలతో చేతులు కలపకుండా వాటి స్థాయికి పడిపోకుండానీ స్థాయి నీవు కాపాడు కోవాలి. అలా నీపాటికి నీవుంటే వాటినీ వాటి పనులనూ కనిపెట్టి చూడగలవు. అదే సాక్షిత్వమంటే. అలాంటి స్థితిలో నీవున్నప్పుడే మద్భావం సోధి గచ్ఛతి. నా భావమే వాడు పొందగలడని హామీ ఇస్తున్నాడు భగవానుడు. ఏమిటాయన భావం. చిన్మాత్రంగా సన్మాత్రంగా ఉండిపోవటమే. అలాగే ఈ జీవుడు కూడా ఉండిపోతే వీడిక జీవుడు కా దీశ్వరుడే.

గుణా నేతా న తీత్య త్రీన్ - దేహీ దేహ సముద్భవాన్
జన్మ మృత్యు జరాదుః ఖై - ర్విముక్తో మృత మశ్నుతే 20

  అయితే అది ఇప్పుడెలా పొందుతాడా ఈశ్వర భావమీ జీవుడని ప్రశ్న. దానికి సమాధాన మిస్తున్నది గీత. అంటే ఆ పొందే విధానాన్ని మనకు వివరించి చెబుతున్నది. గుణానేతా న తీత్య త్రీన్. ఈ మూడు గుణాలనూ దాటిపోవాలి మొదట. అది పెద్ద కండిషన్. ఏమిటా గుణాలేమి చేశాయి నీకు హాని. దేహ సముద్భవాన్. దేహోత్పత్తి బీజభూతాన్ అని భాష్యం. ఈ త్రివిధ శరీరాలూ ఏర్పడటానికవే కారణాలు. అందుకే దేహీ. నీవు దేహి వయిపోయావు. దేహం లేకుంటే దేహి లేడు. గుణాలు లేకుంటే దేహం లేదు. గుణాలు నిజంగా ఉన్నాయేమో అంటావా. నిజంగా లేవవి. మాయోపాధి భూతా నంటారా చార్యుల వారు. మన అజ్ఞానవశాత్తూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు