#


Index

గుణత్రయ విభాగ యోగము

కరణాలు మాత్రమే. కాని అవి కేవలం నా కరణాలేననే సత్యం మరచిపోయావు నీవు. మరచిపోయే కరణాలతో చేతులు కలిపి నేనే ఈ పనీ ఆ పనీ చేస్తున్నానని అనవసరంగా కర్తృత్వం నీమీద పెట్టుకొన్నావు. అందుకే సుఖ దుఃఖాదులను భవిస్తూ భోక్తవయ్యావు. ఇదంతా వాటి వ్యవహారం నీమీద అధ్యారోపం చేసుకోటం వల్ల జరిగిన ప్రమాదం. ఇదేమిధ్యా జ్ఞానమంటున్నారు భగవత్పాదులు.

  పోతే ఇప్పుడా కర్తృత్వం వాటి కప్పజెప్పి నీసాక్షిత్వం మరలా నీవు గుర్తు చేసుకోవాలి. అప్పుడు ప్రాణమే కర్త అవుతుంది. మనసే భోక్త అవుతుంది. అంటే గుణాలకే అప్పజెప్పావు కర్తృత్వం. నీవు దాన్ని తప్పించుకొని సాక్షి స్థానంలో ఉంటావు. యదాద్రష్టాను పశ్యతి. ఇలా ఎప్పుడు నీవు చూడగలవో - ఏ దశలో కూడా నీ గుణాలే ఆయా పనులు పెట్టుకొని కర్తలవుతున్నాయి గాని నీ స్వరూపం గాదని ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు నీకే చింతా లేదు. ఏ సమస్యా లేదు. అయితే ఎప్పుడు నాకా భాగ్యమంటావా. వాటిదే కర్తృత్వం నాది కాదని ఎప్పుడు చూడగలవో అప్పుడు.

  అది ఎలాగా అని అడిగితే చెబుతున్నాడు మహర్షి. ఏమని. గుణేభ్యశ్చ పరం వేత్తి. గుణాల పరిధి దాటి వీటి కతీతంగా ఉన్నదే నా స్వరూపమని గ్రహిస్తావో అప్పుడట. గుణ వ్యాపార సాక్షిభూతమని అర్థం వ్రాస్తున్నారు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు