#


Index

గుణత్రయ విభాగ యోగము

ప్రశ్న వచ్చింది. కర్త లేకుండా క్రియ ఏర్పడదు. క్రియే లేకుంటే ఫలమసలే ఏర్పడదు. కర్త నీవై కూచున్నావు. నే నీ క్రియకు కర్తను ఈ ఫలానికి భోక్తను అనుకోటమే ఆ కూచోటం. కర్త అయితే భోక్త అయి తీరవలసిందే. తప్పదు. అదే సంసారం. ఇప్పుడీ కర్త నీవా ఈ ప్రకృతి గుణాలా. శాస్త్రమేమి చెబుతున్నదంటే ప్రకృతి గుణాలే కర్త నీవు కావని చాటుతున్నది. ఇంతకు ముందే హెచ్చరించారు మనలను భాష్యకారులొక విషయం. కార్యకరణ విషయా కారేణ పరిణతా ప్రకృతిః అని ఆయన మాట. కార్యమంటే శరీరం కరణమంటే మనస్సూ ప్రాణమూ ఇంద్రియాలూ. విషయమంటే వీటి చుట్టూ ఉన్న ప్రపంచం. ఏమయిం దిప్పుడు. నీ దగ్గరి నుంచి బాహ్య జగత్తు వరకూ అంతా గుణాత్మకమేనని తేలిపోలేదా. మనసు దగ్గరి నుంచీ గుణాత్మకమే అయినప్పుడిక ఒక పని చేద్దామని ఆలోచిస్తున్న దెవరు. గుణాలే. మరి చేస్తున్నదెవరు. ప్రాణం కూడా గుణాత్మకమే అన్నారు కాబట్టి ఆ పని చేస్తున్నవీ గుణాలే.

  కాబట్టి ఇంతకూ నీవు కర్తవు గావు - భోక్తవు గావు. ఎందుకంటే నీవా లోచించటం లేదు. చేయటమూ లేదు. ఆలోచిస్తున్నది నీ మనస్సు. చేస్తున్నది నీ ప్రాణం. మరి నీవెవరు అప్పటికి. తప్పకుండా నీవు వాటికి సాక్షివయి ఉండాలి. కేవల చైతన్య రూపుడవు మాత్రమే. అప్పుడే నీవు సాక్షివనిపించు కొంటావు. చైతన్య రూపుడవైన నీకీ మనస్సు ప్రాణం కేవలం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు