#


Index

గుణత్రయ విభాగ యోగము

అదే ఇప్పుడీ అధ్యాయంలో సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః ఇత్యారభ్య గుణ స్వరూపం గుణ వృత్తం స్వవృత్తే నచ గుణానాం బంధకత్వం గుణవృత్తని బంధనస్య చ పురుషస్య యా గతిః ఇత్యేత త్సర్వం మిధ్యా జ్ఞాన మజ్ఞాన మూలం బంధ కారణం విస్తరేణ ఉక్త్యా. సత్త్వ రజస్తమో గుణాలనేవి మూడూ ప్రకృతి వల్ల ఏర్పడ్డవని ఆరంభించి గుణస్వరూప మేమిటో వాటి నడవడి ఎలాంటిదో దానితో ఆ గుణాలు మనల నెలా బంధిస్తాయో గుణాల వల్ల కట్టుబడిన పురుషుడికి పట్టే గతి ఏదో అదంతా మిధ్యా జ్ఞాన మూలకమైన సంసార బంధమేనని సవిస్తరంగా బోధించి అధునా సమ్యగ్దర్శనా న్మోక్షో వక్తవ్య ఇత్యత ఆహ భగవాన్. ప్రస్తుతమా బంధంలో నుంచి బయటపడటమే మోక్షం అది మానవుడి కాత్మ జ్ఞానం వల్ల గాని మరి దేనివల్లా లభించదు - అదే సమ్యగ్దర్శనమని చెప్పబోతున్నాడు కృష్ణభగవానుడని అవతారిక వ్రాశారు భగవత్పాదులు. ఇంతకూ సంగ్రహంగా చెబితే ప్రకృతి గుణాలతో మానవుడు తాదాత్మ్యం చెందటమే బంధమైతే - సమ్యగ్దర్శనమైన ఆత్మజ్ఞానం వల్ల దాన్ని వదిలించుకోటమే మోక్షం.

నాన్యం గుణేభ్యః కర్తారం - యదా ద్రష్టా ను పశ్యతి
గుణేభ్యశ్చ పరం వేత్తి - మద్భావం సో ధిగచ్ఛతి - 19

  అది ఇప్పుడెలా సాధించాలో ఆ మోక్షం - దాన్ని బయట పెడుతున్నాడు గీతాచార్యుడు. నాన్యం గుణేభ్యః కర్తారం. కర్త ఎవరని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు