#


Index

గుణత్రయ విభాగ యోగము

కొట్టేయాలని లక్షలు కోట్లు సంపాదించాలని లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని పదిమందీ తమ గొప్పతనాన్ని గుర్తించాలనీ ఎప్పుడూ తాపత్రయ పడుతుంటారు. స్తిమితంగా శాంతంగా తృప్తిగా ఉండలేరు. అలా బ్రతకలేరు. ఇలాంటి వారిని చూస్తే రజోగుణ ప్రభావమెలాంటిదో అర్థమవుతుంది మనకు.

  పోతే ఇక మరికొందరున్నారు మానవులు. వారు మానవజన్మ ఎందుకెత్తారో ఏమి సాధించాలనో అర్థమే కాదు. మహామూఢులు – ఏదీ పట్టించుకోరు. ఏ గొప్ప విషయాన్ని గురించీ ఆలోచన లేదు. ఒకటి తెలుసుకొందామనే కుతూహలమే లేదసలు. కనీసం తమకు తెలియక పోయినా తెలిసిన పెద్దల నడిగి తెలుసుకొందామనే భావమే లేదు. అన్న పానాదులైన నిత్యావసరాలుంటే చాలు వారికి. యధాశక్తిగా వాటిని సేవిస్తూ పశుప్రాయంగా బ్రతుకుతుంటారు. మన్ను దిన్న పాములలాగా పడి ఉంటూ కాలం గడుపుతుంటారు. చివరకు కాలం దీరితే ఎప్పుడో కన్ను మూస్తారు. వీరి వ్యవహారాన్ని బట్టి ఊహించుకోవచ్చు మనం తమోగుణ ప్రభావమంటే ఎలాంటిదో. మొత్తానికి ప్రస్తుత లోక వ్యవహారాన్ని బట్టీ ఆయా మానవుల మనోవాక్కాయ కర్మలను బట్టీ ఎక్కడి కక్కడ తార్కాణ మవుతూనే ఉంటుంది గుణ సంపర్కమింకా వదల లేదని - అది ఎప్పటికీ వదలబోదని.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు