#


Index

గుణత్రయ విభాగ యోగము

సాగిస్తూ సాత్త్వికమైన జ్ఞానం లేక కర్మలతోనే సతమతవుతున్న వారంతా మరణానంతరం మరలా కర్మ భూమి అయిన మనుష్య లోకంలో మానవులుగానే జన్మిస్తారు. అలాగే జఘన్య గుణమైన తమస్సులోనే పడిపోయి దానివల్ల ఏర్పడే నిద్రాలస్యాదులకు లోనైన జీవితమే జీవించిన వారందరూ చివరకలాంటి పశుజన్మలే ఎత్తి పశుప్రాయం గానే బ్రతుకుతూ పోతారు. సందేహం లేదు. అంతేకాదు. ఊర్ధ్వమధ్యమాధో లోకాలనేవి కూడా ఈ త్రిగుణాలకు ప్రతీకలే. సత్త్వరజస్తమో గుణాలే స్వర్గ మర్త్య పాళాతాలు. గుణాలకు సంకేతాలే లోకాలు. ఆలోకాలలో నివసిస్తున్న దేవమానవ దానవ జాతులు కూడా సత్త్వ రజస్తమో గుణాలకు సంకేతాలే. సత్త్వగుణం దేవతలూ. రజోగుణం మానవులూ తమోగుణం దానవులూ. అంతా త్రిగుణాత్మకమీ సృష్టి. ఆయా గుణాలకు తగినట్టు వారి ప్రవృత్తి. వారి ప్రవృత్తికి తగినట్టు జన్మ. జన్మ కర్మను బట్టి. కర్మ గుణాన్ని బట్టి. ఇదీ వరస.

  ఇంతకూ సారాంశమేమంటే ఇంతకు ముందు జన్మలలోనూ గుణ సంపర్కముంది మనకు. ఇప్పుడూ ఉంది. గుణాలతో సంబంధం వదలకుండానే జన్మ లెత్తుతున్నాడు మానవుడు. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని ఇంతకు పూర్వమే చెప్పింది గీత. నీకు మంచి జన్మ గాని చెడ్డ జన్మగాని ప్రాప్తిస్తున్నదంటే అది గుణసంపర్కం వల్లనే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు