ఉదయిస్తుంది అది కార్యాకార్య వివేచనా రూపమైనదే కావచ్చు. అప్పుడది ధర్మజ్ఞానం. లేదా దానిమీద కూడా విరక్తి చెంది ఆత్మ స్వరూపమేమిటో తెలుసుకొందామనే అసలైన జ్ఞానమైనా కావచ్చు. ఏ జ్ఞానానికైనా సత్త్వ గుణమే ప్రేరకం. మరి రజోగుణమో. రజసోలోభ ఏవచ. లోభమే దానికి ఫలం. అన్నీ పోగు చేసుకొని అనుభవించాలనే ఆకాంక్షే తప్ప వైరాగ్యమనేది ఏకోశానా లేదు. వైరాగ్యం లేకుంటే జీవిత గమ్యమైన ధర్మం మీదికి గాని మోక్షం మీదికి గాని మనసు మళ్లదు. మళ్లకుంటే దానికి సంబంధించిన ప్రయత్నమే లేదు. ఇక ప్రమాద మోహౌ తమసః అజ్ఞానమేవచ. అజ్ఞానమే తమో గుణం. దానివల్ల ప్రమాదమూ మోహమూ రెండూ మనసు నావరిస్తాయి. కావలసిన విషయంలో పరాకు చెందట మొకటి. అందులో కూరుకొని పోవటం మరొకటి. అంతకన్నా మరే మంచి ఫలమూ కలగదు.
ఊర్థ్వం గచ్ఛంతి సత్త్వస్థా- మధ్యే తిష్ఠంతి రాజసాః
జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః - 18
ఇంతేకాదు. మరొక సత్యం కూడా ఉంది ఈ గుణాల విషయంలో మానవుడు గ్రహించవలసింది. ఊర్ధ్వం గచ్చంతి సత్త్వస్థాః - సాత్త్వికమైన గుణముండి దానికి సంబంధించిన సత్కర్మ లాచరించే మానవులు చివరకు మరణించిన తరువాత దేవలోకాలలో దేవతలుగా జన్మిస్తారు. వారికి కర్మ దేవతలని పేరు. మధ్యేతి ష్ఠంతి రాజసాః - రాజసమైన బ్రతుకు