వల్లా ఫలితం లేదు. వాటికి తగిన ఫలితాలేవో అవే ఉంటాయి గాని మోక్షఫలానికి మాత్రం నోచుకోలేరు. మంచితనం కాదు మోక్షమంటే. పుణ్యం పోగుచేసు కోవటం కాదు. వాటితో పాటు ఆత్మజ్ఞానం కూడా ఉండాలి. అది ఉంటే చాలు. ఇవన్నీ వాడి కప్రయత్నంగానే అలవడుతాయి.
రబసి ప్రలయం గత్వా కర్మ సంగిషు జాయతే
తథా ప్రలీన సమసి మూఢయోనిషు జాయతే - 15
పోతే ఇక రజోగుణంతో మరణించిన వారి సంగతి. రజసి ప్రలయం గత్వా - రజస్సు ఎక్కువగా ఉన్నవాడు మరణిస్తే వాడు కర్మ సంగిషు కర్మానుష్ఠానంలో జీవితాంతమూ సతమతమయి చివరకా ఆసక్తి వదలకుండానే కన్ను మూస్తారే వారికే లోకాలు ప్రాప్తిస్తాయో ఆ లోకాలలో వీడూ వెళ్లి పడతాడు. వారిలాగే మరలా ఈ మనుష్య లోకంలో జన్మిస్తాడు. అలాగే తమసి ప్రలీనః తమస్సు ఉల్బణంగా ఉండి మరణించాడను కోండి. వాడే లోకానికి పోయినా పోకున్నా వాడు జన్మించేది ఆఖరుకు మనుష్య జాతిలో కూడా కాదు. బుద్ధి పూర్తిగా మట్టగించటమే గదా తమస్సంటే. సుషుప్తిలాంటి దది. కనుక దానితో పోయిన వారికి మూఢత్వం గాక మరేముంటుంది. పశుపక్ష్యాదులు లాగా మూఢమైనది వాడి ప్రవృత్తి. వశుప్రాయంగానే బ్రతికాడు యావజ్జీవమూ. ఆహార నిద్రా భయమైధునాదులు తప్ప మరేదీ లేదా జీవితానికి. మతెంతో గతంత