యాత్ర ఇలా సాగిపోతున్నది. కాని ఇలా విడి పడటమూ మారటమూ పరస్పరం లావాదేవీ పెట్టుకోటమూ అంతా ఒక ఆ భాసే గాని యథార్ధంగా ఏదీ జరగలేదు.
అయితే యథార్ధంగా జరగలేదు. ఆ ఈశ్వర తత్త్వ మొక్కటే ఉందనే వాస్తవం మానవుడు గుర్తించాలంటే వాడీ ఆ భాస ద్వారానే గుర్తించాలా తత్త్వాన్ని అసతో మా సద్గమయ అన్నట్టు అసత్యం ద్వారానే సత్యాన్ని ఫలానా అని తెలుసుకోవలసి ఉంటుంది. అసత్యమే సత్యానికి లక్షణ Indication మని చెప్పా మింతకు ముందు. తనపాటికది అసత్యమైనా ఉన్న సత్యాన్ని చూపటానికదే తోడ్పడుతుంది. సర్పం అసత్యమైనా సత్యమైన రజ్జువును చూపే దదే గదా. అలాగే జీవ జగద్రూపంగా విస్తరించిన ఈశ్వర చైతన్యం సర్పంలాగా మనకిలా కనిపిస్తున్నా ఇది సత్యం కాదు. సత్యమైన ఈశ్వర చైతన్య మిందులో మరుగుపడి ఉంది. దాన్ని మరలా ప్రత్యభిజ్ఞ చేసుకోవాలంటే ఇవే తోడ్పడతాయి. ఎలాగంటే నేనున్నాని చిద్రూపంగా నాలో స్ఫురిస్తున్నదది. నేను చూచేదంతా ఉన్నదున్నదని సద్రూపంగానూ ప్రపంచమంతా స్ఫురిస్తున్నది. అస్తిభాతి అనే ఈ స్ఫూర్తి లేని పదార్ధ మణు మాత్రం లేదు సృష్టిలో. కనుకనే జీవజగత్తులలో సర్వత్ర వ్యాపించి ఉన్న ఈ సత్తా స్ఫురత్తలను వీటి ద్వారానే పట్టుకోవలసి ఉంది మనం. అలా మనం పట్టుకోటానికే ఉందీ చరా చర ప్రపంచ మసలు. సృష్టి ప్రయోజన మసలు సృష్టి కర్త స్వరూపాన్ని పట్టుకోటానికే. అంతేగాని సృష్టి ప్రవేశాదులు వాస్తవంగా జరిగాయని చెప్పటం కోసం కాదు. ఈ వెలుతు రెక్కడిదో
Page 17