#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

సిద్ధాంతం. కనుక ఈశ్వరుడే సద్రూపంతో జడ ప్రపంచంగా మారిపోయాడు. చిద్రూపంతో జీవరూపంగా ఇందులో ప్రవేశించాడని చెప్పటం సబబు. అది కూడా నిజంగా మారటమూ కాదు నిజంగా ప్రవేశించటమూ గాదు మరలా. మారినట్టు చేసినట్టు కనిపిస్తున్నాడంత మాత్రమే. సృష్టి ప్రవేశాదులు వాస్తవంలో జరగలేదు. అలాంటప్పుడీ జరిగిందని జరిగినట్టని నసుగుతూ నసుగుతూ చెప్పవలసిన అవసరమేమిటని ప్రశ్న. దానికి సమాధానం భగవత్పాదుల మాటలలోనే ముందు వినిపిస్తాను వినండి. యాభ్యాం ప్రకృతి భ్యాం ఈశ్వరః జగదుత్పత్తి స్థితి లయహేతుత్వం ప్రతిపద్యతే. ఈ పరా పర ప్రకృతుల మూలంగానే ఆ ఈశ్వరుడు సృష్టి స్థితి లయాలకు నిమిత్తమవుతున్నాడు. అలా కాకుంటే సృష్టి లయాది ప్రసక్తే లేదు. అదైనా అవుతున్నాడని ఎందుకు చెప్పారని అడిగితే ఏమంటున్నాడో తెలుసా. తత్ర క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణ ప్రకృతి ద్వయ నిరూపణ ద్వారేణ తద్వతః ఈశ్వర స్య తత్త్వ నిర్ధారణార్ధ మని సంజాయిషీ ఇస్తున్నారాయన. అంటే ఏమన్న మాట. ఇవి రెండూ కేవలం ప్రకృతులే. ఒకటి తానే. మరొకటి తనదే. శక్తి రూపంగా ఉన్నాయవి రెండూ. చిద్రూపంగా తానే. సద్రూపంగా తనదే. శక్తి శక్తి మతో రభేదః అన్నారు. సచ్చిత్తులు శక్తిరూపంగా ఆయనకు భిన్నం కావు. అవినాభూత మాఈశ్వరుడికి. అవే ఆయన నుంచి విడిబడి ఒకటి జడ ప్రపంచంగా మరొకటి చేతనుడైన జీవరూపంగా భాసిస్తూ భోక్తృ భోజ్యాత్మకంగా ఒకేదానితో ఒకటి సంబంధం పెట్టుకొని ఈ సంసార