#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  ఇంతకూ పరాపర ప్రకృతులలో పరా ప్రకృతి ఏదో గాదు. జీవుడే. జీవుడు కాని ప్రకృతి ఏదైనా ఉందంటే అది అపర. అందుకే భగవత్పాదులు అవతారిక వ్రాస్తూ ఇలా అంటారు. త్రిగుణాత్మికా అష్టధా భిన్నా అపరా సంసార హేతుత్వాత్ పరాచ అన్యా జీవ భూతా క్షేత్రజ్ఞ లక్షణా ఈశ్వరాత్మికా. పృధివ్యాదులైన ఎనిమిది రూపాలలో కనిపిస్తూ త్రిగుణాత్మకంగా మారిపోయిన ఈ జడ ప్రకృతి అపర. ఇదే సంసార బంధానికి హేతుభూతమైనది. అలా కాక క్షేత్రజ్ఞుడనే పేరు గలదీ ఈశ్వర స్వరూపమే అయినదీ మరొక ప్రకృతి ఉంది. అది పర. ఏదో గాదది జీవుడే నంటారాయన. ఈశ్వర స్వరూపమైనది ఈశ్వరుడిలాగా త్రిగుణాతీతమే అవుతుంది గాని త్రిగుణాత్మకం కాదు. కనుకనే ఆయన అపరను త్రిగుణాత్మక మన్నాడే గాని పర నా మాట అనలేదు. అనకపోగా అది ఈశ్వర స్వరూపుడైన జీవుడేనని పేర్కొన్నాడు. దీన్నిబట్టి ప్రకృతి అని పేరేగాని ఇది నిజంలో పురుషుడే. కేవలం ప్రకృతే తానని అభిమానించటం మూలాన్నే తానూ ఒక ప్రకృతి అయి కూచున్నాడు. అలా కూచున్నా వస్తుతః ఈశ్వరుడే. అప్పటి కా ఈశ్వరుడే ప్రకృతి ద్వయంలో ఒకదానితో శరీరమనే గృహాన్ని నిర్మించుకొని మరొకదాని రూపంలో తానే వచ్చి ఈ గృహంలో ప్రవేశించాడన్న మాట. ఆ గృహమే జగత్తు. గృహస్థుడే జీవుడు.

  ఆ మాటకు వస్తే గృహాన్ని నిర్మించుకొన్నాడని చెప్పినా తప్పేనేమో. అలా చెబితే ఈశ్వరుడీ ప్రపంచానికి నిమిత్తమే అవుతాడు గాని ఉపాదానం కాలేడు. నిమిత్తోపాదాన కారణాలు రెండూ ఈశ్వరుడే నని గదా అద్వైత