దానికే బ్రహ్మాకార వృత్తి అని పేరు. అది జీవితాంతమూ ఆ వృత్తి అవుతూ జీవితాంతంలో కూడా నిలబడితే చెప్పండి. అదే జీవుడికి విదేహముక్తిని ప్రసాదిస్తుంది. మరేదీ గాదు.
అయితే ఇప్పుడీ చెప్పిన సాత్త్వికమైన జ్ఞానం వల్ల వాడికి
మరణానంతరం సంభవించే ఫలిత మేమిటంటారు. మోక్షం కాదు. ఉత్తమ
విదాంలోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఉత్తమ జ్ఞాన సంపన్నులైన
పెద్దలందరూ పొందే లోకా లేవున్నవో అక్కడికి వెళ్లిపోతారు. అవి
అమలమైనవే నిర్మలమైనవే కావచ్చు ఆలోకాలు. కాని లోకాలే అవి. అంటే
ఒకానొక దేశమే. తదా అప్పుడని పేర్కొంటున్నాడు కాబట్టి ఒకానొక
కాలం కూడా. అంతేకాదు. ప్రతిపద్యతే పొందట మంటున్నాడు కాబట్టి
ఒకానొక క్రియ కూడా ఉందక్కడ. ఇలా దేశకాలాది నియమ మున్నంత
వరకూ ఎంత ఉత్తమమైనా అమలమైనా అది పుణ్యలోకాను భవమే కాని
మోక్షానుభవం కాదు. అందుకే ఉత్తమ విదామనే మాటకు భగవత్పాదులు
మహదాది తత్త్వ విదామని అర్థం వ్రాస్తారు. ఇది ప్రకృతి గుణాల పరిధిలోనే
జరుగుతున్నది కాబట్టి సాంఖ్యులు చెప్పిన అవ్యక్త మహ దహంకారాల
సంపర్కం వదలని మనస్తత్త్వమున్న వారి లోకాలనే చెప్పవలసి ఉంటుంది.
అందుకే భారతంలో భీష్ముడేమి - ఆయన మనవడు ధర్మరాజేమి తమ జీవిత కాలంలో ఎన్నో ధర్మాకార్యాలు చేశారు. ఎందరికో