#


Index

గుణత్రయ విభాగ యోగము

కనపడదు. ఘటరంధ్రాల ద్వారా దాని ప్రకాశం బయటికి ప్రసరిస్తుంటే దాన్ని బట్టి అఖండమైన ఆ దీపకాంతి నర్థం చేసుకోగలం మనం. అలాగే ఘటం లాంటి శరీరమూ దాని రంధ్రాల లాటి ఇంద్రియ ద్వారాలూ దానికి బయట ఉన్న చరాచర పదార్థాలూ ఒక్కసారిగా ఇలా మనకెప్పుడు చక్కగా స్ఫురిస్తుంటాయో అప్పుడే మనం గ్రహించవచ్చు సత్త్వం మనలో బాగా వృద్ధి అయిందని దాని ప్రకాశమే ఇదంతా నని. అదీ పామరులలో ఏ మాత్రమూ బయటపడదు పండితులలో కొంత బయట పడుతుంది. కొంత పడదు. సిద్ధ పురుషులలో అయితే బాగా వ్యక్తమయి కనిపిస్తుంది.

లోభః ప్రవృత్తి రారంభః - కర్మణా మశమః స్పృహా
రజస్యేతాని జాయంతే - వివృద్ధే భరతరభ - 12

  మరి సత్త్వం గాక రజోగుణం విజృంభించిందని చెప్పటానికేమిటి చిహ్నమని అడిగితే వర్ణిస్తున్నారు. తోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహా. ఒకటి లోభమూ రెండు ప్రవృత్తీ మూడు కర్మారంభమూ నాలుగు కర్మానుపశమమూ అయిదు స్పృహా ఇలాటి అనర్థాలన్నీ ఎప్పుడు మన అనుభవానికి వస్తుంటాయో అప్పుడు రజసి వివృద్ధే - రజోగుణం విజృంభించిందని అర్థం చేసుకోవలసి ఉంటుంది. లోభాదులైన ఈ అవలక్షణాలన్నీ ఎలా ఉంటాయో వాటిని వర్ణించి చెబుతున్నారు భగవత్పాదులు. లోభః పరద్రవ్యాదిత్సా ఇతరుల సొమ్ము వారివ్వకుండానే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు