#


Index

గుణత్రయ విభాగ యోగము

సానబెట్టినట్టే దీనికే పదును పెట్టాలి. పెడితే బ్రహ్మాండంగా ప్రకాశిస్తుంది. అది పైకి వచ్చి ప్రకాశిస్తున్నట్టు గుర్తేమిటంటే చెబుతున్నాడు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశః ఉపజాయతే. తొమ్మిది ద్వారాలున్నాయి ఈ దేహంలో. బ్రహ్మరంధ్రమూ నాభిరంధ్రమూ మరి రెండు కలుపుకొంటే పదకొండవుతా యవి. బాహ్య ప్రపంచోపలబ్ధికి ద్వారాలివి. దశేంద్రియాలూ మనస్సూ ప్రాణం. ఇవన్నీ అలాంటి ద్వారాలే. వీటిలో నుంచి లోపల ఉన్న జ్ఞాన ప్రకాశమెప్పుడు బయటికి తన వెలుగు చిమ్ముతుందో అప్పుడా ప్రకాశమే లింగం మనకు సత్త్వగుణం బాగా వృద్ధి అయిందని చెప్పటానికి. నానాచ్ఛిద్ర ఘటో దర స్థిత మన్నట్టు శరీరమనేది ఒక ఘటం లాంటిది. దీనికి లేదు ప్రకాశం. చక్షు రాదీంద్రియాలూ కేవలం ద్వారాలే. వాటికీ లేదు. పోతే ప్రాణం మనస్సూ చలించే స్వభావమున్నా వాటికీ స్వతహాగా లేదు జ్ఞానం. జ్ఞానమే స్వతః ప్రకాశం. అది కదిలిస్తే కదులుతున్నాయివి. ప్రకాశింప జేస్తే ప్రకాశిస్తుంటాయి. అందుకే వీటిని ద్వారాలన్నారు.

  ఇవే మనకు కనిపిస్తుంటాయి కదులుతున్నట్టు వెలిగిపోతున్నట్టు. వీటిని కదలిస్తున్న వెలిగిస్తున్న ఆ జ్ఞాన ప్రకాశమేదో అది మనకు ప్రత్యక్షంగా గోచరించదు. అంచేత ప్రత్యక్షంగా గోచరించే వీటిచలన ప్రకాశాలను బట్టి లోపల ఆ చైతన్య ప్రకాశమెంతగా వెలిగిపోతున్నదో మన మూహించు కోవచ్చు. ఒక ఘటంలో దీపమున్నా అది మనకు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు