పగలు 10 గంటల నుంచి సాయంకాలం 4 వరకూ మధ్యాహ్న సమయం. రజోగుణం విజృంభించే సమయం. కాబట్టి అప్పుడే ఉద్యోగాదులూ వ్యాపారాదులూ సాగిస్తుంటారు మానవులు. పనులు చేసుకొనే కాలమది. పోతే ఇక సాయంకాల మసుర వేళ అంటారు. రాత్రి చెప్పనే అక్కర లేదు. తమోగుణ ప్రభావం పనిచేసే సమయమది. అందుకే అన్ని ఆలోచనలూ మాని అన్ని పనులకూ స్వస్తి చెప్పి మానవులకు నిర్వ్యాపారులయి నిద్ర పోవాలని పిస్తుందా సమయంలో.
ఇంతకూ మనమర్థం చేసుకోవలసిందేమంటే లంకలో పుట్టినవాళ్ళందరూ రాక్షసులే అన్నట్టు మూడూ మూడే అయినా ఈ గుణాలలో విభీషణుడి లాంటి మంచి గుణం సత్త్వం. ఎప్పటికైనా బ్రహ్మజ్ఞానానికి పనికి వచ్చే గుణం మనకదే. అయితే ఇది రజస్తమస్సలతో మలినమై పోయింది. దాన్నే మనం నిరంతర బ్రహ్మ చింతనతో శుద్ధి చేసుకోగలిగితే అప్పుడు దాని నిర్మలత్వం బయటపడుతుంది. అలా పడే కొద్దీ అది ఐహికామైన జ్ఞాన సుఖాలే గాక ఆముష్మికమైన ధర్మానికి కూడా తోడ్పడుతుంది. ఇంకా పరిశుద్దమైతే చివరకు మోక్ష మార్గాన్ని కూడా ప్రకాశింప చేసి మన బుద్ధులనా మార్గంలోనే నడపటానికి కూడా సహకరిస్తుంది. అంతకన్నా పురుషార్ధమేముంది జీవితానికి. వాడుకొనే పద్ధతిలో వాడుకోగలిగితే గుణమే గుణాతీత దశను మనకందించే