#


Index

గుణత్రయ విభాగ యోగము

వ్యవసాయాదులలో మనసునూ శరీరాన్నీ ప్రవేశపెట్టి అనుక్షణమూ లౌకికమైన వ్యాపకాలు మన మెడకుచుట్టి అందులోనే ముంచి తేలుస్తుంది. పోతే తమస్సు మిగతా రెండింటినీ వశం చేసుకొని విజృంభించిందో మన జ్ఞానాన్నీ కర్మనూ రెంటినీ త్రోసి పుచ్చి కేవలం మనలను బద్ధకస్తులను చేసి ఇహమూ పరమూ దేనికీ కొరగాకుండా మనలను జాడ్య స్థితికి చేరుస్తుంది.

  మొత్తం మీద ఒక గుణం పైకి వచ్చిందంటే మిగతావి రెండూ పనిచేయకుండా మూగవైపోతాయి. వాటి నణగద్రొక్కి పైకి వచ్చిన ఈ గుణమే రాజ్యం చేస్తుంటుంది. అప్పుడీ గుణాని కనుగుణంగానే ఉంటుంది మన ప్రవర్తన. One at a time అన్నట్టు ఏది పైకి వస్తే దానికే ప్రాబల్యం. అంతేకాదు. ఏది ప్రబలమైతే అది పైకి వస్తుంది. మిగతా గుణాలక్కడ లేవని గాదు. ఉన్నా వాటికి బలం చాలదు. కాబట్టి పనిచేయలేవు. ఇదే పని చేస్తూ మన జీవితాన్ని తన బాటలోనే నడుపుతూ పోతుంది. మూడూ సమఉజ్జీగా పనిచేస్తే ఒకదాని ప్రభావం మరొక దానిమీద పని చేసి జీవితమంతా ఒడుదుడుకులు లేకుండా సాగిపోవటాని కవకాశముంటుంది. అలాకాక పోయేసరికి బ్రతుకు బండి వాటు పడే ప్రమాద మేర్పడుతుంది. సాధారణంగా మన దినచర్యలో ప్రాతఃకాలం సత్త్వ గుణానికి నిలయం. అప్పుడదే ప్రసన్నంగా ఉంటుంది. కనుకనే ధర్మకార్యాలు గాని బ్రహ్మచింతనాది సన్గోష్ఠి గాని ఆ సమయంలో చేయటమే మంచిది. మరి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు