ఒకవేళ చేతనత్వమున్నా అది ఆహారాదుల వరకే పరిమితం. ఇంతకన్నా నికృష్టమైన జీవితమేముంది. కనీసం రజోగుణమైనా మేలు. ఏదో ఒక పనిచేసి ఏదో సాధించాలని పురికొల్పుతుంది నిన్ను. ఇది ఏ పనీ లేక సోమరిగా కాలం వెళ్లబుచ్చమని నిన్ను నిద్రబుచ్చే బాపతు. ఇక పుణ్యమా పురుషార్ధమా. ఏదీ లేదు.
రజస్తమ శ్చాభిభూయ సత్త్వం భవతి భారత
రజ స్సత్త్వం తమశ్చైవ - తమ స్సత్త్వం రజస్తథా -10
అయితే ఇప్పుడు ఉక్తం కార్యం కదా కుర్వంతి గుణాః ఈ చెప్పిన పనులన్నీ ఎప్పుడు చేస్తూ పోతాయీ గుణాలని ప్రశ్న. దానికి సమాధాన మిస్తున్నదీ శ్లోకం. ముందు సత్త్వగుణ మెప్పుడు దాని కార్య మారంభిస్తుందో చెబుతున్నారు. రజస్తమశ్చ అభిభూయ. రజస్తమో గుణాలను రెండింటినీ అణచి వేసి సత్త్వం పైకి వస్తే అది చేయవలసిన పని చేస్తుంది. అంటే సుఖంగా జీవితం కొనసాగేలాగా చూస్తుంది. జ్ఞానమూ సుఖమూ రెంటినీ మన కందిస్తుంది. అది బ్రహ్మజ్ఞానం కాక పోవచ్చు. ధన కనక వస్తు వాహనాదులు పోగు చేసుకొనే జ్ఞానమైనా అందిస్తుంది. వాటివల్ల కలిగే సౌఖ్యమైనా సమకూరుస్తుంది.
అలాగే రజోగుణం సత్త్వతమస్సులను రెండింటినీ అణగదొక్కి పైకి వచ్చిందను కోండి. అప్పుడది ఉద్యోగాలలో వ్యాపారాలలో