#


Index

గుణత్రయ విభాగ యోగము

అవి అసలే నిలకడగా ఉండవు. ఏదో ఒక పని చేయవలసిందే. పగలంతా అవీ ఇవీ పిచ్చి పిచ్చి పనులూ. రాత్రి నిద్ర. ఇంతకన్నా ఏముంది జీవితం. జీవితమంతా ఏది ఆలోచించినా మాటాడినా శరీరంతో ఏ కర్మ చేసినా అదంతా ప్రపంచంతో పెట్టుకొంటున్న లావాదేవేగా. అది ఎప్పటికప్పుడు మారిపోయేదేగా. పోనీ అవి ఏదైనా గొప్ప ఫలితంగానీ అనుభవం గానీ నీకిస్తున్నవా. అదీ తాత్కాలికమే. ఎప్పటికప్పుడు మారిపోయేదే ఆ అనుభవం కూడా. శాశ్వతంగా ఏది నిలబడుతున్నది. నీకూ నాకూ సంతృప్తి నిస్తున్నది.

  పోతే ఇక తమో గుణ విషయ మంటారా. జ్ఞానమా వృత్యతు తమః ప్రమాదే సంజయతి. అది సరాసరి మన జ్ఞానాన్నే కప్పి వేసి మైకంలో పారేస్తుంది. మనస్సు కేదీ స్ఫురించదు. మంచీ లేదు. చెడ్డా లేదు. ఏ గొప్ప ఆలోచనా రాదు మనసుకు. ఏ ఘనకార్యమూ సాధించలేడు జీవితంలో. కేవలం క్రిమికీటకాలూ పశుపక్ష్యాదులూ బ్రతుకుతున్నట్టు బ్రతుకుతుంటాడు. ఆహార నిద్రా భయ మైధునాని అని ఈ నాలుగింటిలోనే గదా వాటి జీవితం వెళ్లిపోతున్నది. అలాగే గడచిపోతుంది వీరి జీవితం కూడా. వాసనా జ్ఞానమే తప్ప వివేక జ్ఞానానికే నోచుకోలేరు. ప్రమాదమంటే పరాకు. మనసెప్పుడూ పరధ్యానంగా ఉంటుంది. జడపదార్థంలాగా పడి ఉంటుంది.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు